logo

‘నిలోఫర్‌’ సూపరింటెండెంట్‌గా డా. ఉషారాణి

నిలోఫర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ ఉషారాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 04 Dec 2022 02:25 IST

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: నిలోఫర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ ఉషారాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె వెంటనే బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్‌ మురళీకృష్ణ ఇదే ఆసుపత్రిలో ప్రొఫెసర్‌గా కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన తిరుపతిలో ఉన్నట్లు తెలిసింది. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామం ఆసుపత్రి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డా.ఉషారాణి 1998లో గాంధీ ఆసుపత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమితులై 2016 వరకు పనిచేశారు. 2016లో నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా వెళ్లి ఏడాదిపాటు ఉన్నారు. 2017లో నిలోఫర్‌కు వచ్చి, పీడియాట్రిక్‌ విభాగాధిపతిగా 2022 ఆగస్టు వరకు బాధ్యతలు నిర్వర్తించారు. కొవిడ్‌ సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో చురుకైన పాత్ర పోషించారు. గతంలో నిలోఫర్‌లో 38 పీజీ సీట్లు ఉండేవని, గత రెండేళ్లలో తాను చేసిన కృషికి ఆ సంఖ్య 60కి పెరిగిందని ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని