logo

అవయవదానంపై అవగాహన పెరగాలి

అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని కిమ్స్‌ ఆసుపత్రుల ఎండీ డాక్టర్‌ బి.భాస్కరరావు అన్నారు.

Published : 04 Dec 2022 02:25 IST

సదస్సును ప్రారంభిస్తున్న డా.భాస్కరరావు, డా. సందీప్‌ అత్తావర్‌

ఈనాడు, హైదరాబాద్‌: అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని కిమ్స్‌ ఆసుపత్రుల ఎండీ డాక్టర్‌ బి.భాస్కరరావు అన్నారు. కొవిడ్‌ తర్వాత చాలామందిలో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయ, దాదాపు 100 మందికి కిమ్స్‌లో మార్పిడి చేశామన్నారు. ఇండియన్‌ సొసైటీ ఫర్‌ హార్ట్‌ అండ్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌(ఐఎన్‌ఎస్‌హెచ్‌ఎల్‌టీ) రెండు రోజుల సదస్సు శనివారం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. సదస్సును డాక్టర్‌ భాస్కరరావు, ఐఎన్‌ఎస్‌హెచ్‌ఎల్‌టీ అధ్యక్షుడు డాక్టర్‌ సందీప్‌ అత్తావర్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. డాక్టర్‌ భాస్కరరావు మాట్లాడుతూ.. ప్రమాదాల్లో బ్రెయిన్‌డెడ్‌ అయిన బాధితుల తరఫున బంధువులు పెద్ద మనసుతో ముందుకొస్తే.. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చన్నారు. సదస్సుకు హాజరైన కార్డియో థొరాసిక్‌ సర్జన్లు, అవయవ మార్పిడి నిపుణులు కలిసి చర్చించడం.. పరిశోధన పత్రాల సమర్పణ ద్వారా పరస్పరం నేర్చుకోవడంతోపాటు రోగులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. డాక్టర్‌ సందీప్‌ అత్తావర్‌ మాట్లాడుతూ.. దేశంలో ఏడాదికి 4 లక్షల అవయవ మార్పిడిలు అవసరం అవుతుండగా.. బ్రెయిన్‌డెడ్‌ కేసుల్లో కేవలం 0.5 శాతమే అవయవదానాలు జరుగుతున్నాయన్నారు. ఏటా బ్రెయిన్‌డెడ్‌ అవుతున్న వారి నుంచి సేకరించిన అవయవాల నుంచి 20 వేల మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని