logo

‘మీరు పాఠాలు చెప్పడం లేదా..’

‘మా పిల్లలు ఏమీ చదవడం లేదు. అన్ని సబ్జెక్టుల్లో పూర్తిగా వెనకబడి ఉన్నారు.. మీరు పాఠాలు సరిగా చెప్పడం లేదా..’ అంటూ బషీరాబాద్‌ మండలం బాబునాయక్‌ తండాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు ఉపాధ్యాయులపై మండిపడ్డారు.

Published : 04 Dec 2022 02:25 IST

ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న తల్లిదండ్రులు, యువకులు

బషీరాబాద్‌: ‘మా పిల్లలు ఏమీ చదవడం లేదు. అన్ని సబ్జెక్టుల్లో పూర్తిగా వెనకబడి ఉన్నారు.. మీరు పాఠాలు సరిగా చెప్పడం లేదా..’ అంటూ బషీరాబాద్‌ మండలం బాబునాయక్‌ తండాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు ఉపాధ్యాయులపై మండిపడ్డారు. తండాకు చెందిన విద్యార్థులు నవల్గా ప్రభుత్వ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. శనివారం ఉదయం యువకులు, తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులను చదివించారు. విద్యార్థులు కొందరు చదివినా.. మరికొందరు చదవలేకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులందరూ పాఠాలు సక్రమంగా బోధిస్తే మా పిల్లలు బాగా చదువుతారని, తొమ్మిది, పదో తరగతిలో ఎలా గట్టెక్కుతారని తల్లిదండ్రులు ప్రశ్నించారు. ప్రాథమిక స్థాయిలో వారికి బోధన సరిగా లేదని.. కరోనా ప్రభావంతో చదువులో కొందరు వెనకబడ్డారని, తొమ్మిది, పదో తరగతికి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తామని ఉపాధ్యాయులు అన్నారు. చదువులో విద్యార్థులందరు చురుకుదనం ప్రదర్శించేలా చేస్తామని ప్రధానోపాధ్యాయులు విజయ్‌కుమార్‌, ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని