logo

చిత్ర వార్తలు

ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియకు సంబంధించి ఈ నెల 8 నుంచి దేహదారుఢ్య పోటీలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు మైదానాల్లో చెమటోడుస్తున్నారు.

Published : 04 Dec 2022 02:25 IST

కొలువులోకి దూకేస్తాం..

ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియకు సంబంధించి ఈ నెల 8 నుంచి దేహదారుఢ్య పోటీలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు మైదానాల్లో చెమటోడుస్తున్నారు. కొలువు సాధించాలని పట్టుదలతో ఉన్న యువత ఉదయం, సాయంత్రం కఠోర సాధన చేస్తోంది. ఇందిరాపార్కు వద్ద గల ఎన్టీఆర్‌ స్టేడియంలో మహిళా అభ్యర్థులు లాంగ్‌ జంప్‌ చేస్తూ కనిపించారు.


ప్రతిభకు అద్దం.. కళకు జీవం

పల్లె వాతావరణం ఉట్టిపడేలా నిర్మించిన గుడిసెలు, కాగితంతో, కర్రలతో, 3డీ మ్యాపింగ్‌తో, ప్రింట్‌మేకింగ్‌, అరుదైన బంజారా కళతో తయారు చేసిన కళాకృతులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక  దినోత్సవం సందర్భంగా వర్సిటీలోని  ‘తరతరాల తెలుగుజాతి’ ప్రాంగణంలో ‘కళామేళా’ పేరిట చిత్ర, శిల్పశాఖకు చెందిన బీఎఫ్‌ఏ ప్రస్తుత, పూర్వ విద్యార్థులు ప్రాణం పోసిన కళాకృతులు ఆకర్షిస్తున్నాయి.

న్యూస్‌టుడే, నారాయణగూడ


ఎడారి వృక్షం.. శివారులో ప్రత్యక్షం

నగర శివారు తుర్కయాంజల్‌ పురపాలిక పరిధి కమ్మగూడ ఇందిరమ్మ కాలనీకి వెళ్లే దారిలో ఖర్జూర చెట్లు నాటుతున్నారు. 20 అడుగులు పెరిగిన ఈ చెట్లను ఒక్కోదానికి రూ.20 వేల చొప్పున వ్యయం చేసి    చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పించారు.


సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ‘టీబీఎఫ్‌ ప్రాపర్టీ ఎక్స్‌పో ఈస్ట్‌’ పేరిట రెండురోజుల ప్రాపర్టీ షోను శనివారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి   సుధీర్‌రెడ్డితో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

న్యూస్‌టుడే, సరూర్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని