logo

రసాయన ట్యాంకర్‌ బోల్తా

 ఔటర్‌ రింగు రోడ్డు దిగే క్రమంలో ఓ రసాయన ట్యాంకర్‌ బోల్తాపడింది. ఈ ఘటనలో రసాయన ద్రావకం లీకవడంతో ఘాటు వాసనలు వెలువడ్డాయి.

Published : 04 Dec 2022 03:12 IST

ఘాటు వాసనలతో వాహనదారుల అవస్థ

బోల్తాపడిన ట్యాంకర్‌

దుండిగల్‌, న్యూస్‌టుడే:  ఔటర్‌ రింగు రోడ్డు దిగే క్రమంలో ఓ రసాయన ట్యాంకర్‌ బోల్తాపడింది. ఈ ఘటనలో రసాయన ద్రావకం లీకవడంతో ఘాటు వాసనలు వెలువడ్డాయి. వాహనదారులు కొంతసేపు ఉక్కిరిబిక్కిరికి గురైనా పెను ప్రమాదం తప్పింది. దుండిగల్‌ ఠాణా పరిధిలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. హరియాణా  నుంచి శుక్రవారం ఎసిటిక్‌ ఎన్‌హైడ్రెడ్‌ ద్రావకం లోడుతో ఓ ట్యాంకర్‌  గాగిల్లాపూర్‌లోని గ్రాన్యుల్‌ ఇండియా కంపెనీకి వెళ్తుంది. ఇందుకోసం దుండిగల్‌లోని ఎగ్జిట్‌ నంబరు-5 వద్ద సాయంత్రం 6.30 గంటల సమయంలో ట్యాంకర్‌ రింగురోడ్డు దిగింది. మరో పావుగంటలో గమ్యస్థానానికి చేరాల్సి ఉంది. ఈ క్రమంలో ఇంటర్‌ఛేంజ్‌ ద్వారా నర్సాపూర్‌-బాలానగర్‌ రోడ్డులోకి ప్రవేశించే క్రమంలో ప్రమాదవశాత్తు ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాపడింది.  కొంతమేర రసాయన ద్రావకం లీకై రోడ్డుపై పడింది. దీంతో  ఘాటు వాసనలతో వాహనదారులను  ఉక్కిరిబిక్కిరయ్యారు. పోలీసులు  ట్యాంకర్‌ను పొక్లెయిన్‌తో పైకి ఎత్తారు. ద్రావకం పెద్దఎత్తున లీకైతే పెనుప్రమాదం జరిగేది. డ్రైవర్‌తో పాటు సహాయకుడు ప్రాణాలతో బయటపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని