logo

చర్మ వ్యాధుల చికిత్సలో బయోలాజిక్‌ ఇంజెక్షన్లు విప్లవాత్మకం

సోరియాసిస్‌, పెంఫిగస్‌, యుర్టికారియా, ఎటాపిక్‌ డెర్మటైటీస్‌ లాంటి సమస్యలకు బయోలాజిక్‌ థెరపీని ఉపయోగించడం పదేళ్లుగా బాగా పెరిగిందని కిమ్స్‌ ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావు తెలిపారు.

Published : 05 Dec 2022 04:27 IST

కిమ్స్‌లో డెర్మటాలజీ సదస్సులో వైద్యుల వెల్లడి

సదస్సులో జ్యోతి వెలిగిస్తున్న అతిథులు  

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: సోరియాసిస్‌, పెంఫిగస్‌, యుర్టికారియా, ఎటాపిక్‌ డెర్మటైటీస్‌ లాంటి సమస్యలకు బయోలాజిక్‌ థెరపీని ఉపయోగించడం పదేళ్లుగా బాగా పెరిగిందని కిమ్స్‌ ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావు తెలిపారు. డెర్మటాలజీ చికిత్సలలో ఇటీవలి సరికొత్త మార్పుల కారణంగానే ఇవి వచ్చాయన్నారు. ఆదివారం కిమ్స్‌ ఆసుపత్రిలోని ఆడిటోరియంలో టీఎస్‌ఐఏడీవీఎల్‌, కిమ్స్‌ ఆసుపత్రి డెర్మటాలజీ విభాగం సంయుక్తంగా బయో-లాజిక్‌- ఆల్‌ పేరుతో డెర్మటాలజీ సదస్సు నిర్వహించాయి. ఆయన మాట్లాడుతూ.. బయోలాజిక్‌ థెరపీ వల్ల కొన్ని లక్షల మంది ప్రభావిత ప్రజలకు లక్షణాలు తగ్గడం, జీవనకాలం పెరగడం, జీవన నాణ్యత మెరుగవడం లాంటివి చూస్తున్నామని తెలిపారు. టీఎస్‌ఎంసీ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజలింగం మాట్లాడుతూ...ఈ తరహా కొత్త చికిత్సలు వైద్యులు తమ నైపుణాన్ని పెంచుకోవడానికి, రోగులకు అత్యంత ఆధునిక చికిత్సలు పొందడానికి ఉపయోగపడతాయని చెప్పారు. రుమటాలజిస్టులు డాక్టర్‌ శరత్‌ చంద్రమౌళి, డాక్టర్‌ అంజనీ గుమ్మడి తమ తమ నైపుణ్యాలను వివరించారు. ఈ బయోలాజికల్‌ ఇంజెక్షన్లతో రోగుల జీవన నాణ్యత గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. సదస్సులో తెలుగు రాష్ట్రాల నుంచి 300 మంది డెర్మటాలజిస్టులు పాల్గొన్నారు. టీఎస్‌ఐఏడీవీఎల్‌ అధ్యక్షులు డాక్టర్‌ రమేష్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జనార్ధన్‌, కోశాధికారి డాక్టర్‌ సత్యశ్రీ, సీనియర్‌ డెర్మటాలజిస్టులు డాక్టర్లు షర్మిలా పాటిల్‌, రఘునాథ్‌ శివన్న, చంద్రావతి, సుధావాణి, ఎస్‌.బి.కవిత, సాయికృష్ణ, విజయ్‌భాస్కర్‌, కిరణ్‌, విక్రమ్‌లు, డాక్టర్‌ ఆనంద్‌కుమార్‌ వగ్గులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని