logo

‘వసతి గృహాల విద్యార్థులకు మెస్‌ఛార్జీలు, ఉపకార వేతనాలు పెంచాలి’

వసతిగృహాల విద్యార్థులకు మెస్‌ఛార్జీలు, ఉపకార వేతనాలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 05 Dec 2022 04:27 IST

ధర్నాలో ఆర్‌.కృష్ణయ్య, విద్యార్థులు

కవాడిగూడ, న్యూస్‌టుడే: వసతిగృహాల విద్యార్థులకు మెస్‌ఛార్జీలు, ఉపకార వేతనాలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో విద్యార్థులతో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్‌ఛార్జీలు, ఉపకార వేతనాలు పెంచాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న పది రూపాయలకు భోజనం ఎలా చేయగలుగుతారని ప్రశ్నించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశ్‌, నాయకులు సతీష్‌, రాజ్‌కుమార్‌, హేమంత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని