logo

వేలాడే వంతెన.. ఇప్పట్లో పూర్తయ్యేనా?

హుస్సేన్‌ సాగర్‌ చెంతన నిర్మిస్తున్న లేక్‌వ్యూ పార్కు.. దానికి అనుసంధానంగా చేపట్టిన వేలాడే వంతెన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రష్యా రాజధాని మాస్కోలోని మోస్క్వా నదిపై నిర్మించిన వేలాడే వంతెన తరహాలో..

Published : 05 Dec 2022 04:27 IST

కొత్త ఏడాదిలో అందుబాటులోకి తెస్తామని గతంలో ప్రకటించిన అధికారులు

వంతెన కోసం చేపట్టిన పనులు

ఈనాడు, హైదరాబాద్‌: హుస్సేన్‌ సాగర్‌ చెంతన నిర్మిస్తున్న లేక్‌వ్యూ పార్కు.. దానికి అనుసంధానంగా చేపట్టిన వేలాడే వంతెన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రష్యా రాజధాని మాస్కోలోని మోస్క్వా నదిపై నిర్మించిన వేలాడే వంతెన తరహాలో.. ఇక్కడా  ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ గతంలో నిర్ణయించింది. కొత్త ఏడాదిలో ఈ వంతెనను అందుబాటులోకి తెస్తామని ప్రకటింది. పనులు నత్తనడక సాగుతున్నాయి.  

హైదరాబాద్‌ పర్యాటకంలో హుస్సేన్‌సాగర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. నగరానికి వచ్చే పర్యాటకులు తప్పకుండా ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు పరిసరాలను సందర్శిస్తుంటారు. దీంతో సాగర్‌ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దడానికి హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల ఇక్కడ రేసింగ్‌ పోటీలు ప్రారంభించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఫార్ములా-ఇ రేసింగ్‌ సైతం సాగర్‌ చెంతనే జరగనుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులోభాగంగా నెక్లెస్‌ రోడ్డులో ఎకో పార్కుతోపాటు యూ ఆకారంలో ఒక వేలాడే వంతెన సాగర్‌ లోపల వరకు నిర్మించనున్నారు. రూ.15 కోట్లు నిధులూ కేటాయించారు. ముంబయికి చెందిన సంస్థకు పనులు అప్పగించారు. ఎడతెగని జాప్యం..పర్యవేక్షణ లోపంతో ముందుకు సాగడం లేదు. దీంతో కొత్త ఏడాదిలో పర్యాటకులకు దాన్ని అందుబాటులోకి తేవడం కష్టమేనని అధికారులే చెబుతున్నారు.

ప్రత్యేక అనుభూతి

ఈ వేలాడే వంతెన పైనుంచి నడుచుకుంటూ హుస్సేన్‌ సాగర్‌ లోపలకు వెళ్లేలా తీర్చిదిద్దుతున్నారు. గాజు ఫలకలతో నిర్మిస్తుండడంతో.. దానిపై నిలబడితే సాగర్‌ జలాలపై తేలియాడినట్లు అనుభూతి  కలగనుందని అధికారులు చెబుతున్నారు. ఎకో పార్కులో ఔషధ మొక్కలు పెంచడానికి ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నారు. నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌ తర్వాత పీవీ ఘాట్‌ మధ్య ఉన్న స్థలంలో ఈ ఉద్యానం రానుంది.  పర్యాటకులు సేదతీరేలా పచ్చదనం, ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు