logo

Hyderabad: రేవ్‌పార్టీలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు

పెద్దఅంబర్‌పేట పసుమాములలోని ఫామ్‌హౌస్‌ కేసులో.. నలుగురు యువతులతో పాటు 37 మందిపై కేసు నమోదుచేసినట్లు ఆదివారం హయత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated : 05 Dec 2022 08:51 IST

నలుగురు యువతులు సహా 37 మందిపై కేసు

హయత్‌నగర్‌: నగర శివారు పెద్దఅంబర్‌పేట పసుమాములలోని ఫామ్‌హౌస్‌ కేసులో.. నలుగురు యువతులతో పాటు 37 మందిపై కేసు నమోదుచేసినట్లు ఆదివారం హయత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి శనివారం తన పుట్టినరోజు వేడుకలను ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేశాడు. వివిధ కళాశాలల్లో చదువుతున్న స్నేహితులనూ ఆహ్వానించాడు. వారంతా గంజాయిపీల్చుతూ, డీజే సౌండ్‌తో హంగామా ప్రారంభించారు. సమాచారం అందుకున్న హయత్‌నగర్‌ పోలీసులు అక్కడికి చేరుకొని రేవ్‌పార్టీని భగ్నం చేసిన సంగతి తెల్సిందే. గంజాయి తాగుతూ పట్టుబడిన ఆరుగురిపై మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం, మిగిలిన వారిపై న్యూసెన్స్‌ కేసులు నమోదు చేశారు. ఫౌమ్‌హౌస్‌ నిర్వాహకుడు సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వేడుకల పేరుతో మాదకద్రవ్యాలు తీసుకుంటే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ యువతను మందలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని