logo

ఉపకారవేతనాలు అందజేయాలని మంత్రి కార్యాలయం ముట్టడి

బీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని నిరసిస్తూ సోమవారం ఖైరతాబాద్‌లోని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కార్యాలయాన్ని పలు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ముట్టడించారు.

Updated : 05 Dec 2022 16:29 IST

పంజాగుట్ట: బీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని నిరసిస్తూ సోమవారం ఖైరతాబాద్‌లోని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కార్యాలయాన్ని పలు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ముట్టడించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. గంగుల కమలాకర్‌ బీసీ హాస్టళ్లను తనిఖీ కూడా చేయడం లేదన్నారు. ఈ కమిషన్‌కు ఓ కమిషనర్‌ కూడా లేడని.. వెంటనే ఓ ఐఏఎస్‌ అధికారిని నియమించాలని డిమాండ్‌ చేశారు. బీసీ కమిషన్‌ అనాథ అయిందని, దీన్ని ఎత్తివేస్తారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో 291 గురుకుల కళాశాలలుంటే ఒక్కదానికి కూడా భవనం నిర్మించలేదని తెలిపారు. వెంటనే ఉపకారవేతనాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ కృష్ణ, నాయకులు వెంకటేశ్‌, అంజి, సతీష్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని