Hyderabad: పూజల పేరుతో మోసాలు.. అరెస్టు చేసిన పోలీసులు

పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. బాధిత మహిళ నుంచి అతడు రూ.47 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడించారు.

Published : 05 Dec 2022 21:28 IST

హైదరాబాద్‌: పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్‌లోని మొహాలీకి చెందిన లలిత్‌ అనే వ్యక్తి పూజల పేరుతో హైదరాబాద్‌లోని బాధితురాలి నుంచి ఏకంగా రూ.47 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. జ్యోతిషంతో సమస్యలు తీరుస్తానని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకున్న లలిత్‌ను బాధిత మహిళ మూడు నెలల క్రితం సంప్రదించారు. మొదటి పూజ పేరుతో మహిళ నుంచి అతడు రూ.32 వేలు వసూలు చేశారు. ఆ తర్వాత విడతల వారీగా రూ.47 లక్షలు వసూలు చేశాడు. అయితే అనుకున్న పనులు నెరవేరకపోవడంతో.. బాధితురాలు ప్రశ్నించింది. దీంతో అతడు ఫోన్‌ ఆఫ్‌ చేసేశాడు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితురాలు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మహిళ ఫిర్యాదు మేరకు లలిత్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. అతడి నుంచి రెండు చరవాణులు, 2 డెబిట్‌ కార్డులు, చెక్‌బుక్‌ స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని