Hyd Metro: మా ప్రాంతానికీ మెట్రో కావాలి: విస్తరణ నేపథ్యంలో తెరపైకి కొత్త డిమాండ్లు
శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రోకి ఈ నెల 9న సీఎం కేసీఆర్ పునాదిరాయి వేయబోతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి మెట్రో కావాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.
ఈనాడు, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రోకి ఈ నెల 9న సీఎం కేసీఆర్ పునాదిరాయి వేయబోతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి మెట్రో కావాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. తమ ప్రాంతానికి మెట్రోని విస్తరించాలని స్థానికులతోపాటు ప్రజాప్రతినిధులూ కోరుతున్నారు.
ఇవీ డిమాండ్లు
* ఖాజాగూడ నుంచి వెళ్లే ఎక్స్‌ప్రెస్ మెట్రోని మణికొండ మీదుగా వేయాలని స్థానికులు కోరుతున్నారు. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని దీంతోనే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
* శంషాబాద్ వరకే పరిమితం చేయకుండా.. అక్కడి నుంచి ఆదిభట్ల వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆదిభట్ల మెట్రోరైలు సాధన పోరాట సమితినే ఏర్పాటు చేశారు. తొలుత ఆదిభట్లకు విస్తరించి.. తర్వాతి దశలో రామోజీ ఫిల్మ్‌సిటీ వరకు విస్తరించాలని సూచిస్తున్నారు.
* ట్రాఫిక్ రద్దీ పెరిగిన దృష్ట్యా ఎల్బీనగర్ నుంచి మెట్రోని హయత్‌నగర్ వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కోరనున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.
* పాతబస్తీలో ఆగిపోయిన ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రోని పూర్తిచేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు.
ప్రత్యామ్నాయాలు
ప్రస్తుతం మెట్రో నిర్మించాలంటే కి.మీ.కు రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. అవసరమైన చోటే మెట్రో నిర్మించి మిగతాచోట్ల మెట్రో నియా తీసుకురావాలన్న దిశలో సర్కారు ఆలోచనలు ఉన్నాయి. మెట్రో నియోకి కి.మీ.కు రూ.110 కోట్లు అవుతుందని గతంలో అధికారులు తెలిపారు. తొలి మెట్రో నియో కేపీహెచ్‌బీ నుంచి కోకాపేట మీదుగా ఓఆర్ఆర్ వరకు రాబోతుంది.
మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనలివి..
* బీహెచ్ఈఎల్ నుంచి పటాన్చెరు(9.9కి.మీ.)
* ఎల్బీనగర్-చాంద్రాయణగుట్ట(9.1కి.మీ)
* ఫలక్‌నుమా నుంచి విమానాశ్రయం( 16.6 కి.మీ)
* ఎంజీబీఎస్-ఘట్కేసర్(23.2 కి.మీ.)
* జేబీఎస్-కూకట్పల్లి వై జంక్షన్(9.6కి.మీ)
* బోయిన్పల్లి-మేడ్చల్(19.2కిమీ.)
* ఎల్బీనగర్-రామోజీ ఫిలింసిటీ(15.9కి.మీ.)
* బీహెచ్ఈఎల్-దమ్మాయిగూడ(37.2 కి.మీ.)
* తార్నాక-కీసర ఓఆర్ఆర్(19.6కి.మీ.)
* చాంద్రాయణగుట్ట-రేతిబౌలి (16.1 కి.మీ.)
* నానక్‌రాంగూడ-బీహెచ్ఈఎల్(13.7 కి.మీ.)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
World News
America: ‘మెంఫిస్’ ఘటన ఎఫెక్ట్.. పోలీసు ప్రత్యేక విభాగం రద్దు!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Crime News
Video: ట్రాలీబ్యాగ్‌లో రూ.64లక్షల విలువైన విదేశీ కరెన్సీ తరలింపు.. ఎలా బయటకు లాగారో చూడండి!
-
India News
Indian Railways: ముంబయి- అహ్మదాబాద్ రైలు మార్గం.. 622 కి.మీల మేర కంచె నిర్మాణం!