logo

మూషిక జింకల పునరుత్పత్తిలో ముందడుగు

జింకల జాతిలో అత్యంత చిన్నప్రాణిగా మూషిక జింకకు పేరుంది. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలో అంతరించిపోతున్న జాతుల్లో షెడ్యూల్‌-1లో ఉన్నాయి.

Published : 06 Dec 2022 02:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: జింకల జాతిలో అత్యంత చిన్నప్రాణిగా మూషిక జింకకు పేరుంది. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలో అంతరించిపోతున్న జాతుల్లో షెడ్యూల్‌-1లో ఉన్నాయి. పునరుత్పత్తిని ప్రోత్సహించి వీటి సంఖ్యను రెట్టింపు చేసేందుకు కేంద్ర జంతు ప్రదర్శనశాల సంస్థ సహకారంతో నెహ్రూ జంతు ప్రదర్శనశాల భాగస్వామ్యంతో హైదరాబాద్‌ సీసీఎంబీలోని లాకోన్స్‌ ల్యాబ్‌ ప్రత్యేక అధ్యయనం చేపట్టింది. ఈ అధ్యయనంలో  అండ్రోస్టెనోన్‌, అండ్రోస్టెనోల్‌ అనే హార్మోన్లు మూషిక జింకల పునరుత్పత్తి చర్యల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. వీరి పరిశోధన ఫలితాలు సెల్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. పరిశోధనలో ఉమాపతిపాటు మను శివకుమార, కరోలిన్‌ కరుణాకరన్‌, అనుపమ శేఖర్‌, మమత సజ్వాన్‌ ఖత్రీ, సందీప్‌ ముస్కం, వాసిముద్దీన్‌, సెంథిల్‌ కుమారన్‌ బాలసుబ్రమణియన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని