రుణ లక్ష్యం.. అంతంతే..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏటా జిల్లా యంత్రాంగం వార్షిక రుణ ప్రణాళికను రూపొందిస్తుంది. దీనికి అనుగుణంగా రుణాలు పంపిణీ చేసి లక్ష్యాన్ని సాధించాల్సి ఉంటుంది.
గడువులోగా పూర్తికి సన్నాహాలు
దరఖాస్తులదారులతో మాట్లాడుతున్న అధికారి
న్యూస్‌టుడే, వికారాబాద్ మున్సిపాలిటీ, వికారాబాద్, తాండూరు: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏటా జిల్లా యంత్రాంగం వార్షిక రుణ ప్రణాళికను రూపొందిస్తుంది. దీనికి అనుగుణంగా రుణాలు పంపిణీ చేసి లక్ష్యాన్ని సాధించాల్సి ఉంటుంది. జిల్లాలో గత ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వ్యవసాయ రంగానికి, ఇతర రంగాలకు రుణ లక్ష్యాన్ని సాధించలేకపోయారని ఇటీవల జరిగిన సమావేశంలో వెల్లడైంది. గడువులోగా పూర్తిచేస్తామని అధికారులు వివరిస్తున్నారు.
రూ.977 కోట్లకు రూ.300 కోట్ల మంజూరు
జిల్లాలో ఈ ఏడాది పంట రుణ లక్ష్యం ఖరీఫ్‌లో రూ.1457 కోట్లుగా నిర్ణయించారు. వీటిని 1,13,949 రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. గత ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 46,290 మంది రైతులకు రూ.855 కోట్లు పంపిణీ చేశారు. లక్ష్యాన్ని 59 శాతం సాధించారు. రబీలో 75,966 రైతులకు రూ.977 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా రెండు నెలల్లో 2500 మంది రైతులకు రూ.300 కోట్లు పంపిణీ చేసి 40 శాతం లక్ష్యం సాధించారు.
* జిల్లాకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.6362 కోట్లతో క్రెడిట్ ప్లాన్‌ను నాబార్డ్ అధికారులు రూపొందించారు. దీనికి సంబంధించిన బుక్‌లెట్‌ను గత నెల చివర్లో జిల్లా పాలనాధికారిణి నిఖల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆవిష్కరించారు. కొన్ని బ్యాంకులు నిర్ణీత రుణ మంజూరు లక్ష్యాన్ని చేరుకోలేక పోయాయని, సాధించాలని తెలిపారు.
జాప్యం ఇలా:
జిల్లాలో 15 బ్యాంక్‌లు వాటి పరిధిలో 92 శాఖలు పని చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి రాయితీ విడుదలైతే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. రాయితీ రుణం మంజూరు కాలేదంటూ బ్యాంకర్లు లబ్ధిదారులకు వాటా చెల్లించాలని వారిపై ఒత్తిడి తెస్తున్నాయి. నిరుద్యోగులు రుణాలకు అర్హత సాధించినా వివిధ కారణాల వల్ల వాటా ధనం చెల్లించలేకపోతున్నారు.
సత్వరం ఆదేశిస్తాం
రాంబాబు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్
పంట రుణాలను గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువే పంపిణీ చేశాం. మరో నాలుగు నెలల గడువు ఉంది. అప్పట్లోగా రుణ శాతం పెంచుతాం. బ్యాంకుల వారిగా నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేస్తాం. అర్హులకు సత్వరమే రుణాలు మంజూరు చేయాలని ఆదేశిస్తాం. లక్ష్యం గడువు తేదీలోగా తప్పకుండా పూర్తి చేస్తాం. రుణాలు మంజూరుకు ఎన్నో అవాంతరాలు ఉండటం వల్లే జాప్యం జరుగుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Spy Balloon: గుబులుపుట్టిస్తున్న చైనా నిఘా నీడ.. అమెరికాలో కన్పించిన రెండో బెలూన్
-
General News
Telangana Assembly: 6న తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్
-
Sports News
Rohit-Virat: రోహిత్, విరాట్.. ఇద్దరూ టీ20 ప్రపంచకప్‌లో ఆడడం కష్టమే..!: వసీం జాఫర్
-
Movies News
Kangana Ranaut: కియారా-సిద్ధార్థ్ వివాహం.. కంగన పొగడ్తల వర్షం
-
World News
Chile: చిలీలో కార్చిచ్చు.. రోడ్లపైకి దూసుకొస్తున్న అగ్నికీలలు..13 మంది మృతి
-
Politics News
Kotamreddy: సజ్జల గుర్తుపెట్టుకో.. నాకు ఫోన్‌కాల్స్ వస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్: కోటంరెడ్డి