logo

అనుమతుల్లేని పాఠశాల మూసివేత

కరణ్‌కోటలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ‘న్యూ ఐడియల్‌’ పాఠశాలను జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవీ ఆదేశాల మేరకు మండల విద్యాధికారి వెంకటయ్య సోమవారం సాయంత్రం మూసివేశారు.

Published : 06 Dec 2022 02:19 IST

ప్రైవేటు బడిని జప్తు చేస్తున్న విద్యాధికారి వెంకటయ్య

తాండూరుగ్రామీణ, న్యూస్‌టుడే: కరణ్‌కోటలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ‘న్యూ ఐడియల్‌’ పాఠశాలను జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవీ ఆదేశాల మేరకు మండల విద్యాధికారి వెంకటయ్య సోమవారం సాయంత్రం మూసివేశారు. వివేకానంద పాఠశాలలోని విద్యార్థులను అదే పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయురాలు కీర్తి మూతపడిన కృష్ణవేణి పాఠశాల భవనానికి తరలించి న్యూ ఐడియల్‌ పేరిట కొత్త ప్రైవేటు పాఠశాలను కొనసాగిస్తోంది. విద్యార్థులను తరలించడంతోపాటు విద్యా శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేటు పాఠశాల నిర్వహించడంపై వివేకానంద పాఠశాల వ్యవస్థాపకులు జ్ఞానేశ్వర్‌ మండల, జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలను మూసి వేయాలంటూ మూడు నెలలుగా విద్యాధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఎట్టకేలకు విద్యాధికారిణి ఆదేశాల మేరకు అనుమతులులేని ప్రైవేటు బడిని జప్తు చేశారు. ఇక్కడి పాఠశాలలో చేరిన విద్యార్థులను తల్లిదండ్రుల అభీష్టం మేరకు తిరిగి వివేకానంద పాఠశాల లేదంటే ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని విద్యాధికారి వెల్లడించారు. పీఆర్‌టీయూ మండలాధ్యక్షులు ఊరడిలక్ష్మయ్య, ప్రమోద్‌, సీఆర్‌టీ మల్లేషం ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని