కల్తీ కారంపొడి పట్టివేత: ముగ్గురి రిమాండ్
కల్తీకారం పొడి తయారు చేసి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకొని రిమాండ్ చేశారు.
మాట్లాడుతున్న డీఎస్పీ కరుణాసాగర్
కొడంగల్, న్యూస్‌టుడే: కల్తీకారం పొడి తయారు చేసి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకొని రిమాండ్ చేశారు. డీఏసీˆ్ప కరుణాసాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..కొడంగల్ పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో గల దుకాణంలో 10కేజీల కల్తీ కారంపొడి లభించింది. దీనిని ఎక్కడ నుంచి తీసుకొని వచ్చారని ఆరాతీయగా కపులా పురం గ్రామం, గండ్వీడ్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆవుసుల శ్రీనివాస్‌చారి నుంచి తీసుకొచ్చినట్లు తెలిపారు. శ్రీనివాసాచారి వద్ద 1.90 క్వింటాళ్ల కారంపొడిని స్వాధీనం చేసుకున్నారు. ఇతను హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రుద్రశేఖర్ కారం పొడి వ్యాపారి వద్ద తెచ్చినట్లు తెలుసుకొని అక్కడ దాడిచేయగా 10 క్వింటాళ్ల కారంపొడి లభించింది. సుమారు రూ.1.50లక్షల విలువ చేసే కారంపొడి పట్టుకొని కిరాణ దుకాణ యజమాని జవేరిలాల్, శ్రీనివాస్‌చారి, రుద్రశేఖర్ ముగ్గురిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సీˆఐ వెంకటేశం, కొడంగల్ సీˆఐ శంకర్, ఎస్సై రవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!