logo

భాజపా, తెరాసవి కుమ్మక్కు రాజకీయాలు: రేవంత్‌రెడ్డి

నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి ఉమ్మడి రాష్ట్రంలో రూ.1500 కోట్లు మంజూరు చేయించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 06 Dec 2022 05:07 IST

కలెక్టర్‌ నిఖిలకు వినతిపత్రం అందజేస్తున్న రేవంత్‌ రెడ్డి, టీఆరర్‌ తదితరులు

కొడంగల్‌: నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి ఉమ్మడి రాష్ట్రంలో రూ.1500 కోట్లు మంజూరు చేయించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దీంతో తనకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టును తొక్కిపెట్టారని ఆరోపించారు. సోమవారం కొడంగల్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. భాజపా, తెరాసలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని తెలిపారు. కేటీఆర్‌ కొడంగల్‌ను దత్తత తీసుకొని నియోజకవర్గానికి  ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.  

వికలాంగుల సంక్షేమానికి కృషి:

వికలాంగుల సంక్షేమం కోసం తమవంతు కృషి చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే ఎన్‌పీఆర్‌డీ అఖిలభారత 3వ మహాసభకు సంబంధించి గోడపత్రికను ఆయన విడుదలచేసి మాట్లాడారు. జిల్లా అధ్యక్షులు దశరథ్‌, సావిత్రమ్మ, మారుతి, అబ్దులప్ప, నర్సింహ పాల్గొన్నారు.

పరిగిలో ఘన స్వాగతం

పరిగి: రేవంత్‌రెడ్డికి పరిగిలో సోమవారం కాంగ్రెస్‌ శ్రేణులు జిల్లా పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కొడంగల్‌ వైపు నుంచి పరిగి మీదుగా వికారాబాద్‌కు బయల్దేరిన ఆయనకు టీఆర్‌ఆర్‌ పట్టణంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు, పరశురాంరెడ్డి, క్రిష్ణ, ఆంజనేయులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతరం వికారాబాద్‌లో ఆందోళన చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని