logo

పౌల్ట్రీ రంగంపై అవాస్తవాలు ప్రచారం చేయొద్దు

పౌల్ట్రీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపేలా అవాస్తవాలను ప్రచారం చేయవద్దని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షులు ఎర్రబెల్లి ప్రదీప్‌ కుమార్‌ రావు అన్నారు.

Published : 06 Dec 2022 02:19 IST

మాట్లాడుతున్న ప్రదీప్‌రావు, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాఘవరావు తదితరులు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: పౌల్ట్రీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపేలా అవాస్తవాలను ప్రచారం చేయవద్దని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షులు ఎర్రబెల్లి ప్రదీప్‌ కుమార్‌ రావు అన్నారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో సోమవారం తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్‌, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు కసిరెడ్డి నారాయణరెడ్డి, జక్కా రాంరెడ్డి, కాసర్ల మోహన్‌రెడ్డి, రాఘవరావు, ఉడతల భాస్కర్‌రావు, సచ్చిదానందరెడ్డి తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. మొక్కజొన్నల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగలేదని వివరించారు. టెండర్‌ ధరకు దాదాపు సమాన స్థాయిలోనే మూడు దఫాలుగా 8.29లక్షల టన్నుల మొక్కజొన్నలను ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి కేటాయించిందన్నారు. ఈ విషయంలో మీడియా అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. బర్డ్‌ఫ్లూ, కొవిడ్‌ సమయంలో మీడియా ఈ రంగానికి ఎంతో అండగా నిలిచిందని, రాజకీయాల్లోకి ఈ రంగాన్ని లాగొద్దని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని