logo

మన నుంచే పరిశుభ్రత ప్రారంభమవ్వాలి

ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే పరిశుభ్రత మన నుంచే ప్రారంభమవ్వాలని జలమండలి ఎండీ దాన కిశోర్‌ సోమవారం అన్నారు.

Published : 06 Dec 2022 02:19 IST

‘వాష్‌’ గోడపత్రిక ఆవిష్కరిస్తున్న జలమండలి ఎండీ దానకిషోర్‌, పురపాలకశాఖ అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే పరిశుభ్రత మన నుంచే ప్రారంభమవ్వాలని జలమండలి ఎండీ దాన కిశోర్‌ సోమవారం అన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని పురపాలకశాఖ కార్యాలయంలో యునిసెఫ్‌ భాగస్వామ్యంతో వాష్‌(నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత) కార్యక్రమ గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఇంట్లో సంభవించే మార్పులు, తాగే నీరు, పరిశుభ్రత కారణంగా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వంలో అన్నిశాఖల అధికారులతో ప్రచారం నిర్వహిస్తున్నామని మెప్మా ఎండీ సత్యనారాయణ తెలిపారు. యునిసెఫ్‌ సహకారంతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నామని వివరించారు. పురపాలకశాఖ అధికారులు, వాష్‌ ప్రతినిధి వెంకటేశ్‌, ఫణిమాల తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని