logo

ఓటరు నమోదు.. పక్కతోవ

రాజధానిలో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం గందరగోళంగా జరిగింది. తొలగించిన ఓటరు కార్డులపై అభ్యంతరాలు, కొత్త ఓటరు దరఖాస్తుల స్వీకరణకు నవంబరు 26, 27 తేదీల్లో.. రెండో దఫాగా డిసెంబరు 3, 4 తేదీల్లో నగరవ్యాప్తంగా మూడు వేల పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఓటరు సేవా కేంద్రాలు బోసిపోయి కనిపించాయి.

Published : 06 Dec 2022 02:19 IST

కేంద్రాల్లో కనిపించని బీఎల్‌ఓలు

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం గందరగోళంగా జరిగింది. తొలగించిన ఓటరు కార్డులపై అభ్యంతరాలు, కొత్త ఓటరు దరఖాస్తుల స్వీకరణకు నవంబరు 26, 27 తేదీల్లో.. రెండో దఫాగా డిసెంబరు 3, 4 తేదీల్లో నగరవ్యాప్తంగా మూడు వేల పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఓటరు సేవా కేంద్రాలు బోసిపోయి కనిపించాయి.

ఉన్నతాధికారిపై వేటు..:

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం ముగిసింది. కార్యక్రమం జరుగుతున్న తీరుపై డిసెంబరు 23 వరకు ప్రతి సోమవారం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలనేది ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశం. ఆ మేరకు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశం సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు నకిలీ దరఖాస్తులపై ఫిర్యాదు చేశారు. పాతబస్తీలో ఒకే ఫోన్‌ నంబరుతో పదుల కొద్దీ వచ్చిన దరఖాస్తులను గుర్తించామని పార్టీ నేతలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. కేంద్ర కార్యాలయం విచారణ చేపట్టి, బాధ్యుడైన అధికారిపై చర్యలు తీసుకుంది. ఫలక్‌నుమా సర్కిల్‌ ఉపకమిషనర్‌ రాజేంద్రనాథ్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు ఇచ్చామని, నకిలీ దరఖాస్తులను నియంత్రించకపోతే మిగిలిన అధికారులపైనా వేటు పడుతుందని కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ అందరు అధికారులను సోమవారం హెచ్చరించారు. తుది ఓటరు జాబితాను జనవరి 5 లేదా 6 తేదీల్లో ముద్రించవచ్చని యంత్రాంగం తెలిపింది.

బీఎల్‌ఓలు లేనట్లేనా..:

ఓటరు సేవా కేంద్రాల్లో కనిపించకపోవడంతో.. జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఎల్‌ఓలు పూర్తిస్థాయిలో ఉన్నారా? లేరా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏడాదంతా ఓటరు సవరణ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన బీఎల్‌ఓలను జీహెచ్‌ఎంసీనిర్లక్ష్యం చేస్తోందని, వేతనాలు ఇవ్వక చాలా మంది విధులకు రావట్లేదనే విమర్శలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని