తక్కువ ధరకే బంగారం!
శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తూ పట్టుబడే బంగారాన్ని తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ బడా మోసానికి తెరలేపాడో హెడ్‌కానిస్టేబుల్.
రూ.50 లక్షలు వసూలు చేసిన హెడ్‌కానిస్టేబుల్
ఈనాడు- హైదరాబాద్, రెజిమెంటల్‌బజార్ న్యూస్‌టుడే: శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తూ పట్టుబడే బంగారాన్ని తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ బడా మోసానికి తెరలేపాడో హెడ్‌కానిస్టేబుల్. ఓ వ్యక్తిని నమ్మించి రూ.50లక్షలు కాజేశాడు. మోసపోయినట్లు తెలుసుకుని బాధితుడు గోపాలపురం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించినా చిక్కకుండా ఫోన్, సిమ్‌కార్డులు మార్చాడు. ఎట్టకేలకు ఈ కేసులో ఛార్జిషీటు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టులో కేసు నమోదైనా తాజాగా వెలుగులోకొచ్చిన ఈ వ్యవహారం నగర పోలీసు విభాగంలో చర్చనీయాంశంగా మారింది.
పోలీసని తెలియదు..
మణికొండ పుప్పాలగూడలో నివాసం ఉండే రామిరెడ్డి.. ప్రసుత్తం మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. రామిరెడ్డి 2013 నుంచి 2017 వరకు శంషాబాద్ విమానాశ్రయంలో డిప్యూటేషన్‌పై పనిచేశాడు. ఇదే సమయంలో తనకు పరిచయమైన రెజిమెంటల్‌బజార్ వాసి సయ్యద్ యాహిమ్ రబ్బానికి ఎయిర్‌పోర్టులో తనిఖీల్లో భాగంగా పట్టుకున్న బంగారముందని.. దాన్ని తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. అతడి నుంచి రూ.50లక్షలు తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా బంగారం ఇవ్వకుండా కాలయాపన చేశాడు. బాధితుడు గట్టిగా అడగడంతో చెక్కులు, ఒక పత్రం రాసి ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి తప్పించుకుని తిరుగుతుండటంతో బాధితుడు కోర్టు ద్వారా పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఈ ఏడాది ఆగస్టు మూడో వారంలో కేసు నమోదు చేశారు. సమాచారం తెలుసుకున్న రామిరెడ్డి ముందస్తు బెయిల్ తీసుకుని.. ఆ పత్రాలను ఠాణాలో సమర్పించేందుకు వెళ్లాడు. అప్పుడు కూడా నిందితుడు హెడ్‌కానిస్టేబుల్ అనే విషయం పోలీసులకు తెలియకపోవడం గమనార్హం.
తోటి సిబ్బందికి టోకరా..
రామిరెడ్డి వ్యవహారంపై ఆరా తీసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న సమయంలో పలువురు సిబ్బంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని.. తిరిగి చెల్లించలేదని గుర్తించారు. దీనిపై సాక్ష్యాలు సేకరించిన పోలీసులు.. తాజాగా న్యాయస్థానంలో ఛార్జిషీటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Jairam Ramesh: భారత్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ: కాంగ్రెస్
-
General News
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదల
-
India News
Pakistan: పాకిస్థాన్‌లో అంతుచిక్కని వ్యాధితో 18 మంది మృతి
-
Politics News
Eknath Shinde: ‘2024లో ఎన్డీయేదే పవర్.. మోదీ అన్ని రికార్డులూ బ్రేక్ చేస్తారు’
-
General News
Taraka Ratna: తారకరత్న హెల్త్ అప్డేట్.. కుప్పం చేరుకున్న బెంగళూరు వైద్య బృందం
-
Movies News
Social Look: చంద్రికా రవి ‘వాహనంలో పోజులు’.. ఐశ్వర్య ‘స్పై’ లుక్!