logo

ఇళ్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుకు 20 వరకు గడువు

నగరంతోపాటు శివారులోని పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణలో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని 44 కాలనీల్లో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో నం.118ను అక్టోబరు 28న తీసుకువచ్చింది.

Published : 06 Dec 2022 02:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంతోపాటు శివారులోని పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణలో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని 44 కాలనీల్లో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో నం.118ను అక్టోబరు 28న తీసుకువచ్చింది. దాదాపు పుష్కర కాలంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ఇబ్బందులు పడుతుండగా.. వాటిని క్రమబద్ధీకరించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అంబర్‌పేట, ఉప్పల్‌, ఎల్బీనగర్‌ పరిధిలోని కాలనీల్లో ఏళ్లుగా నివాసముంటున్న పేదలకు మేలు జరగనుంది. చదరపు గజం కేవలం రూ.250 కట్టించుకుని క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించింది. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన పేదలు, మధ్య తరగతి ప్రజలు ఈ నెల 20వ తేదీలోగా నిర్దేశిత అర్హత పత్రాలతో మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్‌ కార్డు, పొజిషన్‌కు సంబంధించి రిజిష్టర్‌ డాక్యుమెంట్‌/ ఆస్తి పన్ను రసీదు/ విద్యుత్తు బిల్లు/ నీటి బిల్లు వంటివి సమర్పించే వీలుంది. దరఖాస్తుతో పాటు రూ.500 ఫీజు కింద చెల్లించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని