తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు.. మొయినాబాద్ పోలీసులకు చుక్కెదురు

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో మొయినాబాద్ పోలీసులకు చుక్కెదురైంది. భాజపా నేత బీఎల్‌ సంతోష్‌, తుషార్‌, కేరళకు చెందిన జగ్గుస్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌లను నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమో తిరస్కరణకు గురైంది. 

Updated : 06 Dec 2022 14:45 IST

హైదరాబాద్: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో మొయినాబాద్ పోలీసులకు చుక్కెదురైంది. భాజపా నేత బీఎల్‌ సంతోష్‌, తుషార్‌, కేరళకు చెందిన జగ్గుస్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌లను నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమో తిరస్కరణకు గురైంది. నలుగురిని నిందితులుగా చేరుస్తూ గత నెల 22న నాంపల్లి అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టులో మొయినాబాద్‌ పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు.. మెమోను కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని