logo

4 వేల మెగావాట్లు అవసరం

విద్యుత్తు డిమాండ్‌ మూడేళ్లుగా పెరగలేదు. ఈ వేసవిలో భారీగా పెరుగుతుందని డిస్కం అంచనా. నగరంలో తొలిసారి 4 వేల మెగావాట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని విద్యుత్తు అధికారులు అంచనా వేస్తున్నారు.

Published : 07 Dec 2022 03:37 IST

2023 మే నెలకు డిస్కం అంచనాలు..

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు డిమాండ్‌ మూడేళ్లుగా పెరగలేదు. ఈ వేసవిలో భారీగా పెరుగుతుందని డిస్కం అంచనా. నగరంలో తొలిసారి 4 వేల మెగావాట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని విద్యుత్తు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎండాకాలంలో పెరిగే విద్యుత్తు డిమాండ్‌ను తట్టుకునేందుకు.. అవసరమైన కరెంట్‌ను సరఫరా చేసేందుకు వీలుగా స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(ఎస్‌ఎల్‌డీసీ)కి తమ అంచనాలను డిస్కం ముందుగా తెలియజేసింది. వినియోగం 84 మిలియన్‌ యూనిట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది.

నగరంలో కొవిడ్‌కి ముందు వేసవి 2019లో అత్యధిక డిమాండ్‌ 3370 మెగావాట్ల వరకు నమోదైంది. లాక్‌డౌన్‌తో 2020లో, కొవిడ్‌ తర్వాతి భయాలతో 2021లో డిమాండ్‌ పెరగలేదు. 2022లోనూ ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తుండటం, వేసవిలో ఎండలు సాధారణంగా ఉండటంతో కరెంట్‌ వినియోగంలో పెద్దగా మార్పులేదు. ప్రస్తుతం శీతాకాలంలోనూ సిటీలో వినియోగం 50 మిలియన్‌ యూనిట్లుగా ఉంది. వేసవి వచ్చేసరికి మరో 34 యూనిట్ల వరకు పెరుగుతుందని అంచనా వేశారు.  

సర్కిళ్ల వారీగా హెచ్చుతగ్గులు

నగరంలో 9 సర్కిళ్లు ఉన్నాయి. గత మూడేళ్లను మినహాయిస్తే సాధారణంగా ఏటా 12.9 శాతం వరకు విద్యుత్తు డిమాండ్‌ ఏటా పెరుగుతూ వస్తోంది. సర్కిళ్లవారీగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌, హైదరాబాద్‌ సౌత్‌, బంజరాహిల్స్‌, సికింద్రాబాద్‌, సరూర్‌నగర్‌, మేడ్చల్‌, హబ్సిగూడ, రాజేంద్రనగర్‌ సర్కిళ్లలో 5 నుంచి 10 శాతం డిమాండ్‌ ఉంటే.. ఐటీ కేంద్రంగా ఉన్న సైబర్‌సిటీ సర్కిల్‌లో మాత్రం 15 నుంచి 20 శాతం వరకు డిమాండ్‌ వృద్ధి ఉందని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని