logo

బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి ‘ఫుడ్‌ లైసెన్సు’

నాణ్యమైన ప్రసాదాల వితరణకు హామీగా బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి జీహెచ్‌ఎంసీ మంగళవారం ఫుడ్‌ లైసెన్సు జారీ చేసింది.

Published : 07 Dec 2022 03:37 IST

ఈవో అన్నపూర్ణకు ధ్రువపత్రం ఇస్తున్న అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: నాణ్యమైన ప్రసాదాల వితరణకు హామీగా బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి జీహెచ్‌ఎంసీ మంగళవారం ఫుడ్‌ లైసెన్సు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌  బాలాజీరాజు, ఫుడ్‌సేఫ్టీ డిజిగ్నేటెడ్‌ అధికారి సుదర్శన్‌రెడ్డి ఇతర అధికారులు దేవాలయం ఈవో అన్నపూర్ణకు ధ్రువపత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎఫ్‌ఎస్‌ఏఐ(ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ ఆఫ్‌ ఇండియా) ప్రవేశపెట్టిన భోగ్‌(బ్లిస్‌ఫుల్‌ హైజెనిక్‌ ఆఫరింగ్‌ టు గాడ్‌) పథకంలో భాగంగా దేవాలయాలకు లైసెన్సుల జారీ చేపట్టామని, మొదటి లైసెన్సును అమ్మవారి దేవాలయానికి ఇచ్చామని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని