logo

నాగోలు కాల్పుల సూత్రధారి గుర్తింపు

నాగోలు కాల్పుల కేసులో రాచకొండ పోలీసులు కీలక పురోగతి సాధించారు. దోపిడీకి ప్రణాళిక రచించిన వ్యక్తి గజ్వేల్‌కు చెందిన మహేంద్రగా గుర్తించారు.

Published : 07 Dec 2022 03:37 IST

నాగోలు, న్యూస్‌టుడే: నాగోలు కాల్పుల కేసులో రాచకొండ పోలీసులు కీలక పురోగతి సాధించారు. దోపిడీకి ప్రణాళిక రచించిన వ్యక్తి గజ్వేల్‌కు చెందిన మహేంద్రగా గుర్తించారు. జ్యుయెలరీ షాపులో దోపిడీ చేసేందుకు నెల రోజుల కిందటే రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. ద్విచక్ర వాహనంపై పలుమార్లు రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరితో కలిసి దోపిడీకి పాల్పడ్డాడు. ఘటన తర్వాత మహేంద్ర నేరుగా గజ్వేల్‌లోని ఇంటికి వెళ్లి బంగారం అక్కడే దాచాడు. అందులోని కొద్ది మొత్తంలోని బంగారం, డబ్బుతో ఓ కారులో వరంగల్‌కు చేరుకున్నాడు. అక్కడే ఉన్న ఓ స్నేహితుడి వద్ద ఆశ్రయం తీసుకున్నాడు. అదే సమయంలో సదరు స్నేహితుడికి మహేంద్ర దోపిడీకి పాల్పడ్డాడని తెలియదని పోలీసులు గుర్తించారు. అక్కడ ఒక రోజు ఉండి.. వెళ్లిపోయాడు. సీసీ ఫుటేజీలను పరిశీలించడంతోపాటు దర్యాప్తులో భాగంగా మహేంద్ర భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఆయా విషయాలు వెలుగులోకి వచ్చాయి. గజ్వేల్‌లోని మహేంద్ర నివాసంలో కిలోన్నరకుపైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహేంద్రకు సహకరించిన భార్య, కారు ఇచ్చిన స్నేహితుడు, ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో గతంలోనే సికింద్రాబాద్‌కు చెందిన మరో వ్యక్తిని అరెస్టు చేయగా.. ఇప్పటివరకు మొత్తం నలుగుర్ని పోలీసులు ఖైదు చేశారు. మహేంద్ర, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. రాజస్థాన్‌, హరియాణా రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని