logo

మళ్లీ వాడుకుందాం..నీటి వృథా తగ్గిద్దాం

భవిష్యత్తులో నీటికొరతను అధిగమించేందుకు నీటి పునర్వినియోగాన్ని అమలు చేస్తున్న విదేశీ నగరాల తరహాలోనే దేశ రాజధాని సహా మెట్రోనగరాల్లో వ్యర్థజలాలను శుద్ధిచేసి వినియోగించుకునే ప్రక్రియ మొదలైంది

Updated : 07 Dec 2022 05:37 IST

మెట్రో నగరాల్లో  పెరుగుతున్న శుద్ధిజలాల  వినియోగం
ఈనాడు, హైదరాబాద్‌

కోకాపేటలో నిర్మాణంలో ఉన్న కేంద్రం

భవిష్యత్తులో నీటికొరతను అధిగమించేందుకు నీటి పునర్వినియోగాన్ని అమలు చేస్తున్న విదేశీ నగరాల తరహాలోనే దేశ రాజధాని సహా మెట్రోనగరాల్లో వ్యర్థజలాలను శుద్ధిచేసి వినియోగించుకునే ప్రక్రియ మొదలైంది. ఐదారేళ్ల నుంచి జాతీయ హరిత ట్రైబ్యునల్‌  ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు నీటి పునర్వినియోగంపై దృష్టి సారించాలంటూ హెచ్చరించడంతో అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఐటీ, పారిశ్రామిక రంగాలకు సరఫరా చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం మెట్రో నగరాల్లో 15-25శాతం మాత్రమే రీసైక్లింగ్‌ వాటర్‌ను వినియోగిస్తుండగా... వచ్చే రెండేళ్లలో 40శాతానికి పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
దిల్లీ, ముంబయి అగ్రస్థానం : వ్యర్థజలాలను శుద్ధిచేసి పునర్వినియోగించడంలో దిల్లీ, ముంబయి నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. దిల్లీ సహా నేషనల్‌ కాపిటల్‌ రీజియన్‌(ఎన్‌సీఆర్‌)లో ఈ ప్రక్రియ రెండు, మూడేళ్లుగా ఊపందుకుంది. ముంబయిలో  ప్రస్తుతం రోజుకు 14లక్షల లీటర్లను శుద్ధి చేస్తున్నారు.  చెన్నైలో రెండుచోట్ల భారీగా ఎస్‌టీపీలు నిర్మిస్తుండగా.. బెంగుళూరు అధికార యంత్రాంగం అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్‌ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించి అక్కడే ఈ కేంద్రాలను నిర్మిస్తోంది.

ఐటీ సంస్థలకు.. భవన నిర్మాణాలకు

గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు తాగునీరు అందిస్తున్న జలమండలి ప్రస్తుతం రోజుకు శుద్ధిచేసిన 6 లక్షల లీటర్ల నీటిని ఐటీరంగానికి, పరిశ్రమలు, భవన నిర్మాణాలకు సరఫరా చేస్తోంది.  కొన్ని రియల్‌ సంస్థలు తమకు నిత్యం సరఫరా చేయాలంటూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు