logo

50 గజాల ఇంటి స్థలం కోసం ఓ మహిళ బలవన్మరణం

యాబైగజాల ఇంటి స్థలం కోసం ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ‘నా ముగ్గురు ఆడపిల్లల బాగోగుల కోసం కొన్న స్థలాన్ని దాయాదులు కాజేయడానికి యత్నిస్తున్నారు.

Published : 07 Dec 2022 03:58 IST

చదువుల సుగుణ

శంషాబాద్‌, న్యూస్‌టుడే: యాబైగజాల ఇంటి స్థలం కోసం ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ‘నా ముగ్గురు ఆడపిల్లల బాగోగుల కోసం కొన్న స్థలాన్ని దాయాదులు కాజేయడానికి యత్నిస్తున్నారు. బంధువుల ముందు నన్ను, నా భర్తను దుర్భాషలాడార’ని.. ఓ మహిళ ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శంషాబాద్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఆర్జీఐఏ పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సిద్ధేశ్వరకాలనీకి చెందిన చదువుల నరసింహలు, శివరాములు అన్నదమ్ములు. వీరిద్దరూ అదేకాలనీలో 50గజాల చొప్పున వంద గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. స్థలం విషయంలో కొంతకాలంగా ఆ రెండు కుటుంబాల మధ్య వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో నరసింహులు కుమారుడు రామ్‌జీ, అతని భార్య సుగుణ(35) బంధువు అంత్యక్రియల్లో పాల్గొనగా.. అక్కడ శివరాములు కుటుంబ సభ్యులు రామ్‌జీ, సుగుణ దంపతులను అసభ్య పదజాలంతో దూషించారు. అవమానానికి గురైన సుగుణ.. ఇంటికి వచ్చి ఒంటికి నిప్పు పెట్టుకుంది. తీవ్రంగా గాయపడిన సుగుణను ఆసుపత్రికి తరలించగా మృత్యువాత పడింది. సుగుణకు ఇరవై ఏళ్ల లోపు ముగ్గురు కుమార్తెలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు