logo

‘ప్రజల కోసం చావడానికైనా సిద్ధమే’

ప్రజల కోసం చావడానికైనా సిద్ధమేనని ఇసామియాబజార్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్‌సీ) వైద్యాధికారి డాక్టర్‌ వసంత్‌కుమార్‌ అన్నారు.

Published : 07 Dec 2022 03:58 IST

పత్రాలను చూపుతున్న డాక్టర్‌ వసంత్‌కుమార్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: ప్రజల కోసం చావడానికైనా సిద్ధమేనని ఇసామియాబజార్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్‌సీ) వైద్యాధికారి డాక్టర్‌ వసంత్‌కుమార్‌ అన్నారు. తాను కొనుగొన్న కరోనా, డెంగీ, ఆవుల్లో లంపీ వ్యాధి మందులను శాస్త్రీయంగా నిరూపిస్తానని స్పష్టం చేశారు. తనను పిచ్చివాడిగా భావించకుండా మందులను పరిశీలించాలని, తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. వీటి వినియోగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలని కోరారు. తన మందులను గుర్తించాలని ఆరోగ్య కేంద్రం తలుపులు వేసుకొని చేపట్టిన నిరసన దీక్ష మంగళవారం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయనతో ‘న్యూస్‌టుడే’ ఫోన్‌లో మాట్లాడింది. కొవిడ్‌ను యువకుల్లో రెండు రోజులు, వృద్ధుల్లో నాలుగు రోజుల్లో తగ్గించవచ్చని తెలిపారు. డెంగీ మందును పరీక్షించగా ఒకేరోజు ప్లేట్లెట్స్‌ 30 వేల నుంచి 2 లక్షలకు పెరిగాయని పేర్కొన్నారు.

అధికారుల సమీక్ష: డాక్టర్‌ వసంత్‌కుమార్‌ దీక్షపై వైద్యాధికారిణి డాక్టర్‌ పద్మజ, కాచిగూడ ఏసీపీ ఆకుల శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్‌ రామలక్ష్మణరాజు సమీక్షించారు. పరిస్థితిని వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీక్ష విరమించి ఆరోగ్య కేంద్రం నుంచి ఆయన బయటకు వచ్చే వరకు నిరీక్షించాలని భావిస్తున్నారు. దీక్షను భగ్నం చేయొద్దని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని