logo

సాంకేతిక లోపంతో వెనక్కి వచ్చిన నాసిక్‌ విమానం

గాల్లోకి ఎగిరిన ఓ విమానం సాంకేతిక లోపంతో వెనక్కి వచ్చి అత్యవసరంగా దిగిన సంఘటన  శంషాబాద్‌ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.

Published : 07 Dec 2022 03:58 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: గాల్లోకి ఎగిరిన ఓ విమానం సాంకేతిక లోపంతో వెనక్కి వచ్చి అత్యవసరంగా దిగిన సంఘటన  శంషాబాద్‌ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. విమానాశ్రయ అధికారుల కథనం ప్రకారం.. స్పైస్‌జెట్‌ విమాన సర్వీస్‌ 84మంది ప్రయాణికులతో ఉదయం 6.30 గంటలకు నాసిక్‌ బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన పది నిమిషాల్లో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని పైలట్‌ గమనించాడు. వెంటనే శంషాబాద్‌ ఏటీసీ అధికారులకు సమాచారమివ్వగా.. వెనక్కి రమ్మని అత్యవసర ల్యాండింగ్‌ చేయించారు. ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధుల పొంతనలేని సమాధానాలతో సహనం కోల్పోయిన ప్రయాణికులు ధర్నాకు దిగారు. ఉద్రిక్తత  నెలకొంది. ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు.. నాలుగు గంటలు ఆలస్యంగా ఉదయం 10.40కి మరో విమాన సర్వీస్‌లో ప్రయాణికులను నాసిక్‌కు పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని