logo

సమతామూర్తి కేంద్రం శిల్పి ప్రసాద్‌ స్థపతికి ఆచార్య విశ్వకర్మ అవార్డు

సమతామూర్తి కేంద్రం శిల్పి, చీఫ్‌ ఆర్కిటెక్ట్‌ డీఎన్‌వీ ప్రసాద్‌ స్థపతికి ఆచార్య విశ్వకర్మ అవార్డు దక్కింది. ముంబయికి చెందిన హిందూ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ తరఫున దేశవ్యాప్తంగా  వివిధ రంగాల్లో హిందుత్వాన్ని పెంపొందిస్తున్న ప్రముఖులకు అవార్డు అందిస్తున్నారు.

Updated : 07 Dec 2022 05:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: సమతామూర్తి కేంద్రం శిల్పి, చీఫ్‌ ఆర్కిటెక్ట్‌ డీఎన్‌వీ ప్రసాద్‌ స్థపతికి ఆచార్య విశ్వకర్మ అవార్డు దక్కింది. ముంబయికి చెందిన హిందూ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ తరఫున దేశవ్యాప్తంగా  వివిధ రంగాల్లో హిందుత్వాన్ని పెంపొందిస్తున్న ప్రముఖులకు అవార్డు అందిస్తున్నారు. శంషాబాద్‌ వద్ద బృహన్‌ రామానుజ విగ్రహం డిజైన్‌తోపాటు సమతామూర్తి కేంద్రాన్ని ఆకర్షణీయంగా ప్రసాద్‌ స్థపతి మలిచారు. ఆయన సేవలకు గుర్తింపుగా అవార్డును ఫౌండేషన్‌ ప్రకటించింది. ఈ నెల పదిన ముంబయిలోని యశ్వంత్‌రావ్‌ చవాన్‌ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని