logo

ఆర్టీసీలో మారిన డబుల్‌ డ్యూటీ నిబంధనలు

 గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌లో డ్రైవర్‌, కండక్టర్‌ డబుల్‌ డ్యూటీ నిబంధనలను ఆర్టీసీ యాజమాన్యం మార్చింది.

Published : 07 Dec 2022 03:58 IST

ఈనాడు, హైదరాబాద్‌:  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌లో డ్రైవర్‌, కండక్టర్‌ డబుల్‌ డ్యూటీ నిబంధనలను ఆర్టీసీ యాజమాన్యం మార్చింది. గతంలో 8 గంటల తన వాస్తవ డ్యూటీకి గాను.. మరో 8 గంటలు పనిచేయాల్సి ఉండేది. మారిన నిబంధనల ప్రకారం చేయాల్సిన 8 గంటల విధులకు అదనంగా మరో 4 గంటలు పనిచేస్తే దానిని డబుల్‌ డ్యూటీగా పరిగణిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటలపాటు ఆ డ్యూటీలో ఉండాలని సూచించింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటలపాటు పనిచేయాలని  పేర్కొంది. ఆర్టీసీ ఈడీ ఆపరేషన్స్‌ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు