logo

‘సుందరీకరణకు ప్రతిపాదనలు పంపండి’

వికారాబాద్‌ పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దటానికి  సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి వెంటనే పంపించాలని పురపాలక సంచాలకులు డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ అధికారులకు సూచించారు.

Published : 07 Dec 2022 03:58 IST

మాట్లాడుతున్న మున్సిపల్‌ సంచాలకులు డాక్టర్‌ సత్యనారాయణ, కలెక్టర్‌ నిఖిల, అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తదితరులు

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వికారాబాద్‌ పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దటానికి  సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి వెంటనే పంపించాలని పురపాలక సంచాలకులు డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా కలెక్టర్‌ నిఖిల, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఓఎస్‌డీ మహేందర్‌, ఈఎన్‌సీ శ్రీధర్‌, సంయుక్త సంచాలకుడు రమేశ్‌బాబుతో కలిసి ఆయన సమీక్షించారు. పట్టణంలో కొత్త ప్రతిపాదనలతో రోడ్ల వెడల్పుతో పాటు సెంట్రల్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేస్తామని అన్నారు. జంక్షన్‌ల వద్ద ఉన్న పాత విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ఏర్పాటుపై చర్చించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌కుమార్‌, పుర అధ్యక్షురాలు మంజుల, కమిషనర్‌ శరత్‌చంద్ర, డీఈ రాంకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆధార్‌ నవీకరణ తప్పనిసరి : కలెక్టర్‌

జిల్లాలోని పౌరులందరూ తప్పనిసరిగా ఆధార్‌ నవీకరణ చేసుకోవాలని జిల్లా పాలనాధికారిణి నిఖిల తెలిపారు. మంగళవారం తన ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు  చేస్తున్న పలు సంక్షేమ పథకాలు పొందాలంటే తప్పని సరిగా ఆధార్‌ నవీకరణ చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు పోలీసు అధికారి రషీద్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ సత్యకాల, ఎల్‌డీఎం రాంబాబు, ఈడీఎం మహేశ్వరం, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని