TS News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. రామచంద్రభారతి, నందకుమార్‌ విడుదలకు మార్గం సుగమం

ఎమ్మెల్యేలకు ఎర కేసులో రిమాండ్‌లో ఉన్న ఏ1 రామచంద్రభారతి, ఏ2 నందకుమార్‌ విడుదలకు మార్గం సుగమమైంది. ఇద్దరు నిందితులు గురువారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.

Updated : 07 Dec 2022 21:41 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇద్దరు నిందితుల విడుదలకు మార్గం సుగమమైంది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఏ1 రామచంద్రభారతి, ఏ2 నందకుమార్‌ తరఫున న్యాయవాది నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఒక్కొక్కరికీ రూ.6లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరి జామీను సమర్పించారు. దీంతో ఏసీబీ కోర్టు బెయిల్‌ పత్రాలు జారీ చేసింది. ఈ పత్రాలను చంచల్‌గూడ జైలులో సమర్పించిన తర్వాత జైలు అధికారులు వాటిని పరిశీలించి గురువారం ఇద్దరినీ విడుదల చేయనున్నారు. వారం రోజుల క్రితమే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ పూచీకత్తు, జామీను సమర్పించడంలో ఆలస్యం కావడంతో ఇప్పటి వరకు విడుదల కాలేకపోయారు. ఇదే కేసులో ఏ3 సింహయాజీ ఇవాళ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని