logo

దస్త్రాల్లోనే పీహెచ్‌సీ..!

కోట్‌పల్లి మండలంలోని కరీంపూర్‌ గ్రామానికి పది సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) మంజూరు చేసింది.

Updated : 08 Dec 2022 05:23 IST

దశాబ్దం దాటినా నిర్మించని భవనం

మంజూరైన కరీంపూర్‌ గ్రామం

న్యూస్‌టుడే, కోట్‌పల్లి: కోట్‌పల్లి మండలంలోని కరీంపూర్‌ గ్రామానికి పది సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) మంజూరు చేసింది. నేటికీ అక్కడ పీహెచ్‌సీ భవన నిర్మాణం చేపట్టలేదు. చేసేది లేక ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తితే సమీప పీహెచ్‌సీలకు, మరీ తీవ్రంగా ఉంటే నగరబాట పట్టాల్సి వస్తోంది. కనీసం తమ కష్టాలను చూసైనా అధికారులు వెంటనే భవన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

గతంలో బంట్వారంలో..: కరీంపూర్‌ గ్రామం గతంలో బంట్వారం మండలంలో భాగంగా ఉండేది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు గ్రామానికి పీహెచ్‌సీ మంజూరైంది. పది సంవత్సరాల క్రితమే నిర్మాణానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు సైతం వచ్చాయి. తరువాత ఎవరూ పట్టించుకోక పోవడంతో నాటి నుంచి నేటి వరకు ఆసుపత్రి నిర్మాణం కలగానే మిగిలింది. నాలుగు సంవత్సరాల క్రితం కరీంపూర్‌ పీహెచ్‌సీకి వైద్యురాలు హారికను నియమించారు. గ్రామంలో పీహెచ్‌సీ లేకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు డిప్యుటేషన్‌పై ఆమెను కోట్‌పల్లి పీహెచ్‌సీకి పంపించారు. ప్రస్తుతం ఆమె అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. భవనం నిర్మించి ఉంటే వైద్యురాలు కూడా ఇక్కడే ఉండే వారని, తమకు వైద్య సేవలు అందుబాటులో ఉండేవని పలువురు పేర్కొన్నారు.


త్వరలోనే నిర్మాణం చేపడతాం

అనిల్‌, గ్రామ సర్పంచి

 

మా గ్రామానికి పీహెచ్‌సీ భవన నిర్మాణం కోసం ఉన్నత అధికారులతో మాట్లాడాం. వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ చొరవతో మంత్రి హరీశ్‌ రావు అనుమతి తీసుకున్నాం. త్వరలోనే భవన నిర్మాణాన్ని చేపట్టి గ్రామంలో వైద్య సేవలు కొనసాగేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని