కొత్తగా ఆలోచించండి.. ఆవిష్కరించండి: మంత్రి సబిత
అర క్షణంలో భూమికి అవతల ఉన్న వారితో మాట్లాడుతున్నా, పక్షిలా ఆకాశంలో విహరిస్తున్నా, ప్రాణాలను హరించే రోగాలను లొంగదీసుకుంటున్నా.. అంతా సైన్స్ మహిమే.
ప్రదర్శన తిలకిస్తున్న మంత్రి సబితా రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు సునీత తదితరులు
వికారాబాద్, న్యూస్‌టుడే: అర క్షణంలో భూమికి అవతల ఉన్న వారితో మాట్లాడుతున్నా, పక్షిలా ఆకాశంలో విహరిస్తున్నా, ప్రాణాలను హరించే రోగాలను లొంగదీసుకుంటున్నా.. అంతా సైన్స్ మహిమే. చెట్టు నుంచి ఆపిల్ కిందకే ఎందుకు పడిందన్న ఆలోచన న్యూటన్‌కు రావడం వల్లే గురుత్వాకర్షణ శక్తి గురించి తెలిసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. వికారాబాద్ పట్టణంలోని కొత్తగడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలలో ఏర్పాటు చేసిన 50వ జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనను ఆమె వికారాబాద్, చేవెళ్ల ఎమ్మెల్యేలు ఆనంద్, యాదయ్య, జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్, రాష్ట్ర బీసీ సంఘం సభ్యుడు శుభప్రద్తో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించడం, ఓటమిని అంగీకరించకుండా విజయం సాధించడం వరకు పరిశోధించడం వల్లే థామస్అల్వా ఎడిసన్ విద్యుత్తు బల్బును కనుక్కోగలిగాడన్నారు.
* సొంత ఆలోచనలతో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వ అభిమతమని, ఇందుకు టి-హబ్ ద్వారా కృషి చేస్తున్నామని, ఇందులో విద్యార్థుల కోసం కొంత స్థలం(స్పేస్) కేటాయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రకటించారని మంత్రి సబితారెడ్డి తెలిపారు. అనంతరం వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించారు. నమూనాల వివరాలను విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, డీఈఓ రేణుకాదేవి, జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్, పురపాలక అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: జడేజా దెబ్బ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. ఆసీస్ స్కోరు 84/4 (36)
-
India News
Adani Group: సుప్రీంకు చేరిన ‘అదానీ’ వ్యవహారం.. రేపు విచారణ
-
Sports News
KS Bharat: రాకెట్ స్పీడ్‌తో ఇక్కడికి చేరుకోలేదు.. ద్రవిడ్ ప్రభావం చాలా ఉంది: కేఎస్ భరత్
-
Movies News
Sridevi: ‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో శ్రీదేవి జీవిత చరిత్ర
-
Crime News
Crime News: విషాదం.. మంటల్లో నలుగురు చిన్నారుల సజీవ దహనం
-
World News
Biden: జిన్‌పింగ్‌కు పరిమితులు తెలుసు..: బైడెన్