నియోజకవర్గంపై సీఎంకు ప్రత్యేక శ్రద్ధ: రోహిత్ రెడ్డి
‘తాండూరు నియోజక వర్గానికి భవిష్యత్‌లో ఇంకా మంచి రోజులు రానున్నాయి.. సీఎం ప్రత్యేక శ్రద్ధ వహించి నిధుల వరద పారిస్తున్నారని’ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, పక్కన జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి,
నాయకులు రామునాయక్, వెంకట్‌రాంరెడ్డి
బషీరాబాద్: ‘తాండూరు నియోజక వర్గానికి భవిష్యత్‌లో ఇంకా మంచి రోజులు రానున్నాయి.. సీఎం ప్రత్యేక శ్రద్ధ వహించి నిధుల వరద పారిస్తున్నారని’ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పల్లెపల్లెకు పైలెట్ కార్యక్రమంలో భాగంగా కొర్విచేడ్, గొట్టిగకుర్దు, మాసన్‌పల్లి, కంసాన్‌పల్లి, బాద్లాపూర్, పర్ష్యానాయక్ తండాల్లో పర్యటించారు. ఏడాదిలోపు అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానన్నారు. బీజేపీ నాయకులు ఇద్దరు డ్రామా కంపెనీ పెట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాండూరు నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల క్షేమం కోసం తాను ఎంతకైనా సిద్ధమన్నారు. తాండూరు అభివృద్ధికి మరో రూ.200 కోట్లు తేవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
భాజపా కుట్రను భగ్నం చేశా..: ‘భాజపా నాకు రూ.25వేల కోట్ల కాంట్రాక్టు ఇస్తానని, మంచి హోదా కలిగిన పదవి కట్టబడెతానని ఆఫర్ ఇచ్చింది. నేను మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్, తాండూరు నియోజకవర్గ ప్రజల ప్రేమ, అభిమానంతో ఒప్పుకోకుండా వారి కుట్రను భగ్నం చేశానని’ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి తొలిసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. .రూ.100 కోట్లు కాదు.. రూ.200 కోట్లైనా ఇస్తాం.. భాజపాలోకి రావాలని కోరారన్నారు. సమావేశాల్లో పార్టీ అధ్యక్షులు రామునాయక్, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి, నర్సిరెడ్డి, సర్పంచులు శివనాయక్, సునీత, పూల్‌సింగ్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే టెస్టు సిరీస్ ఆడటమా..?: ఆసీస్ క్రికెట్ దిగ్గజం
-
Movies News
Kantara: అందుకే ‘కాంతార’ ఆస్కార్‌కు నామినేట్ కాలేకపోయింది: విజయ్ కిరగందూర్
-
World News
Pakistan: పాకిస్థాన్‌పై మరో పిడుగు.. త్వరలో ఇంధన సంక్షోభం..!
-
Sports News
Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషభ్ పంత్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి ఎప్పుడంటే?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Shanthi Bhushan: కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్ కన్నుమూత