ముఖ్యమంత్రి సభకు ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో మెట్రో రైలు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పోలీసు అకాడమీలో కొనసాగుతున్న వేదిక పనులు
నార్సింగి, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో మెట్రో రైలు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం రాయదుర్గం మైండ్ స్పేస్ వద్ద మెట్రో రెండో దశ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో సుమారు 30 వేల మంది పాల్గొంటారని అంచనా.. అధికారులు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సభా స్థలికి వచ్చే వారి కోసం అకాడమీ ప్రహరీని మూడు చోట్ల తొలగించి తాత్కాలిక రాకపోకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. చేవెళ్ల వైపు నుంచి వచ్చే వాహనాలు రాఘవేంద్ర హోటల్ వద్ద మళ్లించనున్నారు. నార్సింగి వైపు నుంచి వచ్చే వాహనాలను పోలీసు అకాడమీ వద్ద వదిలిపెట్టి మళ్లీ వెనక్కి వెళ్లి నార్సింగి గోశాల వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో వాహనాలను నిలుపుకోవాల్సి ఉంటుంది. హిమాయత్‌సాగర్ లార్డ్స్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద, పీరంచెరువు షాదాన్ కళాశాల వద్ద, నార్సింగి గోశాల వద్ద వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు నార్సింగి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. విశాల వేదిక, గ్రౌండ్ మొత్తాన్ని కప్పే విధంగా ప్రేక్షకులకు నీడ ఏర్పాటు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
KS Bharat: రాకెట్ స్పీడ్‌తో ఇక్కడికి చేరుకోలేదు.. ద్రవిడ్ ప్రభావం చాలా ఉంది: కేఎస్ భరత్
-
Movies News
Sridevi: ‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో శ్రీదేవి జీవిత చరిత్ర
-
Crime News
Crime News: విషాదం.. మంటల్లో నలుగురు చిన్నారుల సజీవ దహనం
-
Sports News
IND vs AUS: లంచ్ బ్రేక్.. అర్ధశతకం దిశగా లబుషేన్.. ఆసీస్ స్కోరు 76/2 (32)
-
World News
Biden: జిన్‌పింగ్‌కు పరిమితులు తెలుసు..: బైడెన్
-
World News
Earthquake: చేజారిన ఆ 72 గంటలు.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరగనున్న మృతులు..!