కోరిక తీర్చకుంటే మార్ఫింగ్ చిత్రాలు బయటపెడతా.. యాంకర్‌ను బెదిరిస్తున్న యువకుడు
కోరిక తీర్చాలని, లేకుంటే మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని ఓ టీవీ ఛానల్ యాంకర్‌ను బెదిరిస్తున్న వ్యక్తిపై ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అమీర్‌పేట, న్యూస్‌టుడే: కోరిక తీర్చాలని, లేకుంటే మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని ఓ టీవీ ఛానల్ యాంకర్‌ను బెదిరిస్తున్న వ్యక్తిపై ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సైదులు వివరాల ప్రకారం.. మధురానగర్‌లోని హాస్టల్‌లో ఉంటున్న యువతి(27) యాంకర్‌గా పనిచేస్తోంది. కళాశాలలో చదివే రోజుల్లో సహ విద్యార్థి అయిన కూకట్‌పల్లికి చెందిన కె.సామ్రాట్(30)తో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమె నిరాకరించింది. స్నేహితుల్లా ఉందామని నమ్మబలికాడు.
గతంలో ఓసారి కారులో యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయి అత్యాచారానికి యత్నించాడు. ఆమె తప్పించుకుంది. కక్ష గట్టిన సామ్రాట్ యువతి చిత్రాలను నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేశాడు. తన కోరిక తీర్చకుంటే సామాజిక మాధ్యమాల్లో పెట్టి, పరువు తీస్తానని బెదిరిస్తున్నాడు. బాధితురాలు బుధవారం పోలీసులను ఆశ్రయించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Temples News
తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి.. భీష్ముడిగా నిలిచి..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: మద్యం మత్తులో భార్య, కుమార్తె హత్య
-
Ap-top-news News
AP Govt: మార్చి నెల జీతాలు ఎప్పుడొస్తాయో?
-
Crime News
Duranto Express: బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్..
-
Crime News
Couple Suicide: కరోనా దెబ్బకు నెమ్మదించిన వ్యాపారం.. అధిక వడ్డీలకు అప్పులతో..