logo

కేర్‌ ఆసుపత్రిలో ‘హ్యూగో రోబోటిక్‌’ సర్జరీ

హ్యూగో రోబోటిక్‌ అసిస్టెడ్‌ విధానంలో నగరంలో తొలి బేరియాట్రిక్‌ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు కేర్‌ ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి.

Published : 08 Dec 2022 02:17 IST

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: హ్యూగో రోబోటిక్‌ అసిస్టెడ్‌ విధానంలో నగరంలో తొలి బేరియాట్రిక్‌ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు కేర్‌ ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. మెడ్‌ట్రానిక్‌ హ్యూగో రాస్‌ విధానంలో ఆసియాలో రెండో బేరియాట్రిక్‌ సర్జరీ(స్లీవ్‌ గ్యాస్ట్రోక్టమి) చేసిన ఆస్పత్రిగా బంజారాహిల్స్‌ కేర్‌ నిలిచింది. ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్‌ గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌(జీఐ) లాప్రోస్కోపిక్‌ అండ్‌ బేరియాట్రిక్‌ వైద్యులు డా.వేణుగోపాల్‌ పారిక్‌ నేతృత్వంలో వైద్యబృందం నిర్వహించారు. 148 కిలోల బరువున్న నగరానికి చెందిన 26 ఏళ్ల వ్యక్తి మధుమేహం, వెన్నెముక నొప్పి, నిద్రలేమి తదితర సమస్యలతో బాధపడుతూ గతనెలలో కేర్‌ వైద్యులను సంప్రదించారు. నవంబర్‌ 28న హ్యూగో రోబోటిక్‌ అసిస్టెడ్‌ విధానంలో శస్త్రచికిత్స విజయవంతంగా చేసినట్లు డా. వేణుగోపాల్‌ పారిక్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని