logo

శస్త్రచికిత్స తరువాత సమస్యలు.. వైద్యులపై కేసు

ఓ రోగి తీవ్ర అనారోగ్యానికి కారణమైన ముగ్గురు వైద్యులపై కేసు నమోదైంది.

Published : 08 Dec 2022 02:18 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఓ రోగి తీవ్ర అనారోగ్యానికి కారణమైన ముగ్గురు వైద్యులపై కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్‌లో నివసించే నర్సింహులు సతీమణి స్వాతి(26) కడుపు నొప్పితో బాధపడుతూ హకీంపేటలోని ఆల్‌నూర్‌ ఆసుపత్రికి వెళ్లగా గత నెల 17న మూత్రాశయ సమస్యకు డాక్టర్‌ ఫాతిమా, మరో ఇద్దరు వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేశారు. 19న ఆమె ఇంటికెళ్లారు. మూత్రం రాకపోవడంతో కడుపు ఉబ్బిపోయింది. గ్యాస్ట్రిక్‌ సమస్యని చెప్పి మాత్రలు ఇచ్చారు. సమస్య తీవ్రం కావడంతో 25న మళ్లీ డా.ఫాతిమాను కలిశారు. ఆమె ఉస్మానియాకి వెళ్లాలని సూచించారు. స్వాతి నేరుగా జూబ్లీహిల్స్‌ అపోలోకు వెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె మూత్రాశయం దెబ్బతిందని తేల్చిచెప్పడంతో అక్కడే చేరారు. స్వాతి భర్త ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు ముగ్గురు వైద్యులపై కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని