logo

కలెక్టరేట్ల నిర్మాణాల్లో అవినీతిపై దర్యాప్తు జరపాలి: భాజపా

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 23 జిల్లాల కలెక్టరేట్లలో భారీఎత్తున అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్సీ, భాజపా నేత ఎన్‌.రాంచందర్‌రావు ఆరోపించారు.

Published : 08 Dec 2022 02:29 IST

మాట్లాడుతున్న ఎన్‌.రాంచందర్‌రావు, చిత్రంలో గీతామూర్తి తదితరులు

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 23 జిల్లాల కలెక్టరేట్లలో భారీఎత్తున అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్సీ, భాజపా నేత ఎన్‌.రాంచందర్‌రావు ఆరోపించారు. దీనిపై ‘సిట్‌’ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సచివాలయం, కలెక్టరేట్ల భవన నిర్మాణాలకు సంబంధించిన ఖర్చుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు కె.గీతామూర్తి, రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్‌రెడ్డి, న్యాయవాది ఆంటోనీరెడ్డి తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. ‘ఎమ్మెల్యేలకు ఎర’ అంశం అవినీతి కేసు కాదని న్యాయస్థానం స్పష్టం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ న్యాయస్థానానికి వ్యక్తిగతంగా హాజరై అఫిడవిడ్‌ ఇచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు దర్యాప్తు సంస్థలకు కాకుండా ముఖ్యమంత్రికి ఎలా వచ్చాయి? ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేలను 22 రోజుల పాటు ఎందుకు ఉంచుకున్నారు? ఫోన్‌ ట్యాపరింగ్‌కు అనుమతి ఉందా? ఎంతమంది ఫోన్లను ట్యాపరింగ్‌ చేశారు? తదితర వివరాలను ప్రజలకు, న్యాయస్థానానికి తెలియజేయాల’ని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని