logo

ఉంగరం పోయిందని మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు

ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ కీసరదాయరలోని తన వ్యవసాయక్షేత్రంలో నవరత్నాల ఉంగరం పోగొట్టుకున్నారు.

Updated : 08 Dec 2022 05:25 IST

నిమిషాల్లో వెతికిపెట్టిన పోలీసులు

కీసరదాయరలో ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌కు ఉంగరం అందజేస్తున్న పోలీసు సిబ్బంది

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ కీసరదాయరలోని తన వ్యవసాయక్షేత్రంలో నవరత్నాల ఉంగరం పోగొట్టుకున్నారు. దాన్ని పోలీసులు నిమిషాల వ్యవధిలోనే వెతికి పెట్టారు. మంగళవారం అనారోగ్యంతో కాపలాదారుడు పనికి రాలేదు. విషయం తెలుసుకున్న ప్రభాకర్‌ సాయంత్రం క్షేత్రానికి వెళ్లారు. గోవులకు పచ్చిగడ్డి కోస్తుండగా ఆయన చేతికున్న బంగారు నవరత్నాల ఉంగరాన్ని పోగొట్టుకున్నారు. వెతికినా దొరకలేదు. ఉదయం విషయాన్ని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌కు తెలిపారు. ఆయన నాలుగు సాంకేతిక బృందాలను క్షేత్రానికి పంపించారు. వారు మెటల్‌ డిటెక్టర్‌తో క్షుణ్నంగా పరిశీలించి ఉంగరం జాడ కనిపెట్టారు.  పోయిన ఉంగరం 20 ఏళ్లుగా తన చేతికి ఉందని ‘న్యూస్‌టుడే’తో చెప్పారు. దాన్ని ఓ స్వామిజీ ఇచ్చారని తెలిపారు. మెటల్‌ డిటెక్టర్‌ నేలలో 3 అడుగుల లోతు ఉన్న వస్తువును కనిపెడుతుందని పోలీసులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని