logo

వేగంగా ఆయుధ లైసెన్సుల జారీ: సీపీ

బ్యాంకులు, నగదు తరలించే ఏజెన్సీలు భద్రత కోసం తృతీయ పక్ష సంస్థలకు సంబంధించిన సాయుధ సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లో నియమించుకోవద్దని హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ స్పష్టంచేశారు.

Published : 09 Dec 2022 04:43 IST

పోలీసు అధికారులతో కలిసి మాట్లాడుతున్న కమిషనర్‌ సీవీ ఆనంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకులు, నగదు తరలించే ఏజెన్సీలు భద్రత కోసం తృతీయ పక్ష సంస్థలకు సంబంధించిన సాయుధ సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లో నియమించుకోవద్దని హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ స్పష్టంచేశారు. అవసరమనుకుంటే బ్యాంకులు, ఇతర సంస్థలు గన్‌ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని, వీలైనంత తక్కువ సమయంలో జారీ చేస్తామని హామీఇచ్చారు. తక్కువ సమయంలోనే సాయుధ సిబ్బంది నేపథ్యాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఇటీవల నకిలీ ఆయుధ లైసెన్సుల ముఠా పట్టుబడిన నేపథ్యంలో.. నగరంలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు, నగదు తరలించే సంస్థలు, ఆర్బీఐ అధికారులతో కమిషనర్‌ ఆనంద్‌ గురువారం కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  సంయుక్త కమిషనర్‌ రమేశ్‌ దృశ్యరూప వివరణ ఇచ్చారు. ఆయుధాల లైసెన్సులు తీసుకోవడం, తుపాకీల కొనుగోలు, అంతర్గత భద్రతా విభాగం(ఐఎస్‌డబ్ల్యూ)తో కలిసి సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణవంటివన్నీ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని