logo

వేగం అదుపు.. ప్రాణం నిలుపు

నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు తీసుకుంటున్న చర్యలు రహదారి ప్రమాదాలను కట్టడి చేస్తున్నాయి. రహదారి భద్రత, నిబంధనల అమలుపై పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోంది. నగర సీపీ సీవీ.ఆనంద్‌ సారథ్యంలో రోప్‌ను ఖచ్చితంగా అమలుచేస్తున్నారు.

Published : 09 Dec 2022 04:43 IST

పోలీసుల జాగ్రత్తలతో తగ్గిన ప్రమాదాలు

ఆధునిక బారికేడ్లను పరిశీలిస్తున్న నగర అదనపు పోలీసు కమిషనర్‌ ఏఆర్‌.శ్రీనివాస్‌, డీసీపీ కరుణాకర్‌

ఈనాడు, హైదరాబాద్‌ : నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు తీసుకుంటున్న చర్యలు రహదారి ప్రమాదాలను కట్టడి చేస్తున్నాయి. రహదారి భద్రత, నిబంధనల అమలుపై పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోంది. నగర సీపీ సీవీ.ఆనంద్‌ సారథ్యంలో రోప్‌ను ఖచ్చితంగా అమలుచేస్తున్నారు. నగరంలో రహదారి ప్రమాదాలు జరుగుతున్న 50 ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్‌ రద్దీ తగ్గి, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండటంతో వాహనదారులు వేగంగా దూసుకెళ్తున్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్యలో అధిక శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఆ సమయంలో.. ఆయా ప్రాంతాల్లో వాహనాల వేగానికి కళ్లెం వేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. గతేడాది ఇవే ప్రాంతాల్లో ప్రమాదాల బారినపడి 121 మంది మృతిచెందగా బారికేడ్ల ఏర్పాటుతో ఆ సంఖ్య 97కు తగ్గినట్టు నగర అదనపు సీపీ(సిట్‌, నేర విభాగం)/ట్రాఫిక్‌  ఇన్‌ఛార్జి ఏఆర్‌.శ్రీనివాస్‌ తెలిపారు. ప్రస్తుతం ఆ 50 ప్రాంతాల్లో జిగ్‌జాగ్‌ పద్ధతిలో సరికొత్త బారికేడ్లు ఏర్పాటుచేయనున్నారు. సైన్‌బోర్డులు, బారికేడ్ల నిర్వహణ తీరును ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లు ఎప్పటికప్పడు పరిశీలించాలని అదనపు సీపీ ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని