logo

ఎల్‌ఆర్‌ఎస్‌లో కదలిక షురూ!

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రొసీడింగ్స్‌ జారీ మొదలైంది. క్రమబద్ధీకరణకు ముందుకొచ్చిన ఫీజులు చెల్లించినవారికి వీటిని అందజేస్తున్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుంది.

Published : 09 Dec 2022 04:43 IST

ప్రొసీడింగ్స్‌ను జారీ చేస్తున్న హెచ్‌ఎండీఏ

ఈనాడు, హైదరాబాద్‌: అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రొసీడింగ్స్‌ జారీ మొదలైంది. క్రమబద్ధీకరణకు ముందుకొచ్చిన ఫీజులు చెల్లించినవారికి వీటిని అందజేస్తున్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మధ్యలో ఆగిపోయిన ఎల్‌ఆర్‌ఎస్‌ను తిరిగి కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో దరఖాస్తు చేసుకొని రూ.10 వేల ఫీజు చెల్లించిన లేఅవుట్లుకు మాత్రమే దీనిని వర్తింపజేస్తున్నారు. ఇప్పటికే ఆయా లేఅవుట్లలో 10శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ అయి ఉండాలనేది నిబంధన. ఇలాంటివి హెచ్‌ఎండీఏ పరిధిలో 1,337లో లక్షన్నర ప్లాట్లు ఉండగా.. ఇందులో 40,389 ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ ప్లాట్లు కింద గుర్తించారు. దీంతో రియల్టర్లు ముందుకొచ్చి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఫీజు కింద హెచ్‌ఎండీఏకు రూ.5 కోట్లు వరకు సమకూరింది. తదుపరి ప్రక్రియ కింద ప్రొసీడింగ్స్‌ను జారీ చేస్తే.. వాటి ఆధారంగా ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఈ ధ్రువీకరణ పత్రాలు అందకపోవడంతో ఇప్పటివరకు ఈ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంది. క్రమబద్ధీకరణ ఫీజులు హెచ్‌ఎండీఏకు కాకుండా వేరే ఖాతాకు జమ చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ సమస్యలకు పరిష్కారం లభించడంతో హెచ్‌ఎండీఏ అధికారులు ముందుకు కదులుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలో వేగం అందుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని