సంక్షిప్త వార్తలు
హైదరాబాద్‌లో భారీ బెలూన్‌తో చేపట్టిన ప్రయోగం విజయవంతమైనట్లు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ బెలూన్ ఫెసిలిటీ కేంద్రం గురువారం ప్రకటించింది.
భారీ బెలూన్ ప్రయోగం విజయవంతం
టీఐఎఫ్ఆర్ బెలూన్ ఫెసిలిటీ కేంద్రం ప్రకటన
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ బెలూన్‌తో చేపట్టిన ప్రయోగం విజయవంతమైనట్లు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ బెలూన్ ఫెసిలిటీ కేంద్రం గురువారం ప్రకటించింది. బుధవారం తెల్లని భారీ హీలియం బెలూన్‌తో క్యాప్సూల్ (శాస్త్రీయ పరిశోధన పరికరం)ను ఆకాశంలోకి ప్రయోగించిన సంగతి తెలిసిందే. స్పెయిన్‌కు చెందిన అంతరిక్ష పర్యాటక సంస్థ హాలో స్పేస్ భాగస్వామ్యంతో ప్రయోగం చేపట్టారు. బెలూన్ ఫెసిలిటీ కేంద్రం నుంచి క్యాప్సూల్‌ను ప్రయోగించి ఆకాశంలో నిర్దేశిత ఎత్తులో వాతావరణ స్థితిగతులు అంచనా వేశారు. దాదాపు 2.8లక్షల క్యూబిక్ మీటర్ల పరిమాణంతో కూడిన బెలూన్ను 800 కేజీల బరువు(క్యాప్సూల్ బరువు 620 కిలోల)తో ప్రయోగం చేపట్టారు. ఆకాశంలో 36.9 కిలోమీటర్ల మేర ఎత్తుకు చేరుకుని 20 నిమిషాలపాటు వివిధ అంశాలపై శోధించింది. అనంతరం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగండ్ల వద్ద కిందకు దిగింది. నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యావరణ స్థితిగతులను అంచనా వేశారు. ప్రయోగంలో హోలోస్పేస్ కంపెనీకి అవసరమైన సమాచారం లభ్యమైనట్లు శాస్త్రవేత్తలు వివరించారు.
పార్శిళ్ల చేరవేత మా బాధ్యత
వినియోగదారులకు రైల్వే, తపాలా అధికారుల హామీ
ఈనాడు, హైదరాబాద్: పార్శిళ్లను మీరు కోరుకున్న చోటుకు పంపించడం మా బాధ్యత.. వాటిని సురక్షితంగా చేర్చుతామని దక్షిణ మధ్య రైల్వే, తెలంగాణ తపాలాశాఖ అధికారులు వినియోగదారులకు హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ సంచాలన్ భవన్లో గురువారం పార్శిల్, సరకు రవాణా వినియోగదారుల రైల్వే, తపాలా శాఖ అధికారులు సమావేశమయ్యారు. ద.మ. రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైల్వేలు విస్తారమైన నెట్వర్క్ కలిగి ఉన్నాయన్నారు. తపాలా శాఖకు సైతం దేశంలోని అన్ని ప్రాంతాలకు పార్శిళ్లు చేరేవేసే సామర్థ్యం ఉందన్నారు. రైళ్లలో పార్శిల్ స్థలాన్ని తపాలా శాఖ సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న లాజిస్టిక్ బేస్‌తో తక్కువ ఖర్చుతో సేవలు అందించవచ్చని తెలంగాణ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ ప్రకాశ్ తెలిపారు. రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీవీఎల్ సత్యకుమార్, ద.మ. రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జి.జాన్ ప్రసాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ డీఆర్ఎంలు అభయ్కుమార్గుప్తా, శరత్ చంద్రయాన్ పాల్గొన్నారు.
బీసీల బడ్జెట్‌ను రూ. 20 వేల కోట్లకు పెంచాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
కాచిగూడ, న్యూస్‌టుడే: తెలంగాణలో బీసీలకు కేటాయించే బడ్జెటును రూ.20 వేల కోట్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న 271 బీసీ గురుకుల పాఠశాలలకు, అన్నివసతులతో సొంత భవనాలు నిర్మించేందుకు రూ. 400 కోట్లు మంజూరు చేయాలన్నారు. ఈ విషయమై గురువారం సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితరులతో కలిసి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆయన కలిసి మాట్లాడారు. బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకూ రూ. 4 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ చదివేవారితో పాటు ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీల్లో చదివే బీసీ విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లించాలని కోరారు.
12 నుంచి రామకృష్ణ మఠంలో శిక్షణ తరగతులు
కవాడిగూడ, న్యూస్‌టుడే: రామకృష్ణమఠంలోని వివేకానంద మానవ వికాస కేంద్రంలో.. ఈ నెల 12 నుంచి 17 వరకు కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సు నిర్వహిస్తామని రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మఠంలో మాట్లాడారు. ఇతరులతో క్రియాశీలక సంబంధాలు పెంచుకోవడం, సమాచారం సేకరణ, వినడం, స్పష్టంగా భావాన్ని వ్యక్తీకరించడం తదితర అంశాల్లో కోర్సు ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు ఆఫ్‌లైన్ తరగతులు ఉంటాయని, 18 నుంచి 50 ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 04027627961 ఫోన్ నంబరులో సంప్రదించాలని సూచించారు.
* వివేకానంద మానవ వికాస కేంద్రం ఆధ్వర్యంలో.. ఈ నెల 12 నుంచి ఐదు రోజులపాటు.. ‘లేవండి, మేల్కొనండి, భయం నుంచి బయటపడండి’ అనే అంశంపై ప్రతి రోజు సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ఆన్లైన్ తరగతులూ జరుగుతాయని స్వామి బోధమయానంద తెలిపారు.
రేపు పాస్‌పోర్టు సేవల ప్రత్యేక డ్రైవ్
ఈనాడు, హైదరాబాద్: పాస్‌పోర్టు దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఈ నెల 10న(శనివారం) ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆర్పీవో దాసరి బాలయ్య తెలిపారు. అమీర్‌పేట్, బేగంపేట్, టోలిచౌకితోపాటు కరీంనగర్, నిజామాబాద్‌లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పీవోపీఎస్కేల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. 60 శాతం తత్కాల్, 40 శాతం సాధారణ అపాయింట్మెంట్లు విడుదలయ్యాయని, రీషెడ్యూల్, ప్రీపోన్, కొత్త దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఫైర్, హెల్త్సేఫ్టీ కోర్సుల్లో శిక్షణ
అంబర్‌పేట, న్యూస్‌టుడే: ఫైర్, హెల్త్సేఫ్టీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్, సేఫ్టీ ఇంజినీరింగ్ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం అంబర్‌పేటలో మాట్లాడుతూ పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్, ఫైర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ, సబ్ ఫైర్ ఆఫీసర్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్‌లో శిక్షణ ఉంటుంది. ఈ నెల 23 లోపు www.ncttindia.com ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 97014 96748.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rohit-Virat: రోహిత్, విరాట్.. ఇద్దరూ టీ20 ప్రపంచకప్‌లో ఆడడం కష్టమే..!: వసీం జాఫర్
-
Movies News
Kangana Ranaut: కియారా-సిద్ధార్థ్ వివాహం.. కంగన పొగడ్తల వర్షం
-
World News
Chile: చిలీలో కార్చిచ్చు.. రోడ్లపైకి దూసుకొస్తున్న అగ్నికీలలు..13 మంది మృతి
-
Politics News
Kotamreddy: సజ్జల గుర్తుపెట్టుకో.. నాకు ఫోన్‌కాల్స్ వస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్: కోటంరెడ్డి
-
Sports News
IND vs AUS: ఆస్ట్రేలియా జట్టులో కంగారు మొదలైంది..: మహమ్మద్ కైఫ్
-
Movies News
Sameera Reddy: మహేశ్‌బాబు సినిమా ఆడిషన్.. ఏడ్చుకుంటూ వచ్చేశా: సమీరారెడ్డి