logo

ఆలస్యం ఖరీదు.. రూ.15 కోట్ల పైనే

హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున ఏర్పాటు చేస్తున్న లేక్‌వ్యూ పార్కులు నత్తనడకన కొనసాగుతున్నాయి. నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ఈ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో నిర్మాణ వ్యయం పెరిగి ప్రజాధనం వృథా అవుతోంది.

Published : 09 Dec 2022 04:43 IST

లేక్‌వ్యూ పార్కు పనుల తీరిది

ఈనాడు, హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున ఏర్పాటు చేస్తున్న లేక్‌వ్యూ పార్కులు నత్తనడకన కొనసాగుతున్నాయి. నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ఈ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో నిర్మాణ వ్యయం పెరిగి ప్రజాధనం వృథా అవుతోంది. తొలుత రూ.15 కోట్లుతో పనులు ప్రారంభించగా, ఇంతవరకు కొలిక్కిరాకపోవడం గమనార్హం. ముంబాయికి చెందిన డిజైనర్‌కు పనులు అప్పగించడం జాప్యానికి కారణమని తెలుస్తోంది. తొలుత రూ.15కోట్లు వ్యయమనుకున్నా ప్రస్తుతమది రూ.27 కోట్ల నుంచి రూ.30 కోట్లుకు చేరినట్లు తెలుస్తోంది. నెక్లెస్‌రోడ్డులో ఈ లేక్‌వ్యు పార్కులో వివిధ రకాల ఔషధ ఇతర రకాల మొక్కలతోగార్డెన్‌..పర్యాటకులు కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జల విహార్‌ నుంచి పీవీ ఘాట్‌ మధ్య ప్రాంతం మొత్తం ఈ పార్కుకు కేటాయించారు. పర్యాటకులకు మౌలిక వసతులు, పిల్లలు, పెద్దలు ఆడుకునేందుకు గేమ్‌జోన్స్‌ ఏర్పాటుచేయనున్నారు. లేక్‌వ్యూ పార్కు పనులు మాత్రం ఆశించిన రీతిలో సాగడం లేదు. అధికారులు పర్యవేక్షణ లోపం ఇందుకు కారణమనే విమర్శలున్నాయి. ఒకే అధికారికి పలు ప్రాజెక్టుల బాధ్యతలు అప్పగించడంతో  కష్టంగా మారుతోందని అంటున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని