ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
స్నేహితుడి సోదరుడి వివాహానికి వెళ్లిన ఓ ఇంటర్ విద్యార్థి.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
ఇంటర్ విద్యార్థి మృతి.. మరొకరికి గాయాలు
శ్రీచరణ్‌రెడ్డి
అల్వాల్: స్నేహితుడి సోదరుడి వివాహానికి వెళ్లిన ఓ ఇంటర్ విద్యార్థి.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్ పరిధి మన్సూరాబాద్- జనప్రియ ఎన్‌క్లేవ్‌లో నివసించే లక్ష్మారెడ్డి కొడుకు శ్రీచరణ్‌రెడ్డి(17) నల్లకుంటలోని నారాయణ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం హకీంపేటలో తోటి విద్యార్థి సోదరుడి పెళ్లి ఉండటంతో స్నేహితుడు ప్రణవ్‌రెడ్డితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. పెళ్లి కొడుకుకు బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకొని మధ్యాహ్న సమయంలో శామీర్‌పేట వెళ్లి తిరిగి వస్తున్నారు. వేడుక మందిరం సమీపంలో వెనుక నుంచి శ్రీసాయి గణేశ్ ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. బస్సు వెనుక చక్రాలు శ్రీచరణ్‌రెడ్డి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రణవ్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.
ట్రావెల్స్ వాహనంలో వెళ్లుతున్నానని చెప్పి.. లక్ష్మారెడ్డి దంపతులకు శ్రీచరణ్‌రెడ్డి ఒకడే కుమారుడు. గురువారం తోటి విద్యార్థి సోదరుడి పెళ్లి హకీంపేటలో ఉందని స్నేహితులంతా కలిసి ఉప్పల్ నుంచి ప్రైవేటు ట్రావెల్స్ వాహనంలో వెళ్తున్నట్లు చెప్పడంతో తండ్రి అంగీకరించాడు. తన ద్విచక్రవాహనంపైనే ఉప్పల్ రింగ్‌రోడ్డులో దించి వెళ్లాడు. పెళ్లి వేడుక వద్ద బస్సు రూపంలో మృత్యువు కబలించింది. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kangana Ranaut: కియారా-సిద్ధార్థ్ వివాహం.. కంగన పొగడ్తల వర్షం
-
World News
Chile: చిలీలో కార్చిచ్చు.. రోడ్లపైకి దూసుకొస్తున్న అగ్నికీలలు..13 మంది మృతి
-
Politics News
Kotamreddy: సజ్జల గుర్తుపెట్టుకో.. నాకు ఫోన్‌కాల్స్ వస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్: కోటంరెడ్డి
-
Sports News
IND vs AUS: ఆస్ట్రేలియా జట్టులో కంగారు మొదలైంది..: మహమ్మద్ కైఫ్
-
Movies News
Sameera Reddy: మహేశ్‌బాబు సినిమా ఆడిషన్.. ఏడ్చుకుంటూ వచ్చేశా: సమీరారెడ్డి
-
India News
ఘోరం.. వ్యాధి తగ్గాలని 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు..!