logo

ఉరేసుకొన్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్‌

తండ్రితో జరిగిన గొడవలో క్షణికావేశానికి గురై నిండు ప్రాణాన్ని తీసుకోబోయిన ఓ వ్యాపారిని టప్పాచబుత్ర కానిస్టేబుల్‌ బి.సురేష్‌ చాకచక్యంగా కాపాడారు.

Published : 09 Dec 2022 04:43 IST

కార్వాన్‌, న్యూస్‌టుడే: తండ్రితో జరిగిన గొడవలో క్షణికావేశానికి గురై నిండు ప్రాణాన్ని తీసుకోబోయిన ఓ వ్యాపారిని టప్పాచబుత్ర కానిస్టేబుల్‌ బి.సురేష్‌ చాకచక్యంగా కాపాడారు. ఇన్‌స్పెక్టర్‌ సుంకరి శ్రీనివాస్‌రావు, స్థానికుల కథనం ప్రకారం..షేక్‌అన్వర్‌(40) అనే వ్యాపారి కుటుంబసభ్యులతో కలసి శారదానగర్‌ మసీదు సమీపంలో నివసిస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం తండ్రితో గొడవ పడ్డాడు. తీవ్ర మనస్తాపానికి గురై మధ్యాహ్నం ఒంటిగంటకు కోపంగా ఇంట్లోకి వెళ్లి తలుపులేసుకున్నాడు. ఇరుగుపొరుగువారు పిలిచినా తలుపులు తీయలేదు. అనుమానంతో స్థానికులు వెంటనే 100నంబర్‌తో పోలీసులకు సమాచారం అందించారు. నిమిషాల్లో అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్‌ సురేష్‌ వెంటనే సమీపంలో ఉన్న గడ్డపారతో తలుపులు పగులగొట్టి చున్నీతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కొట్టుకుంటున్న బాధితుడి కాళ్లు పట్టుకుని పైకి లేపాడు. ఇరుగు పొరుగువారి సహాయంతో కొన ఊపిరితో ఉన్న బాధితుణ్ని ఆసుపత్రికి తరలించారు. సకాలంలో కానిస్టేబుల్‌ సురేష్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో నిండు ప్రాణాన్ని కాపాడాడని పరిసర ప్రాంతాల వాసులు అభినందిస్తున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో ఉరేసుకున్న ఓ వ్యక్తిని ఇదే కానిస్టేబుల్‌ కాపాడిన సంఘటనను గుర్తు చేస్తూ ఇన్‌స్పెక్టర్‌.. సురేష్‌ను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని